రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 03:30 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే కోపం రాక మానదు (stupid bike stunt viral).
@Ramraajya అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ఓ భారీ ట్రక్ వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో హెల్మెట్ కూడా ధరించకుండా ఓ బైకర్ ఆ ట్రక్ సమీపానికి వచ్చాడు. అతను ట్రక్ డ్రైవర్ వద్దకు వెళ్లి అతనితో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత, బైక్ వేగాన్ని తగ్గించి ట్రక్ మధ్యలోకి వచ్చాడు. తన బైక్‌ను ట్రక్ కిందకు తీసుకెళ్లాడు. ట్రక్ మధ్యలో బైక్‌ను నడుపుతూ చాలా ప్రమాదకర స్టంట్ చేశాడు (reckless biking video).
ఆ సమయంలో ట్రక్ వేగం కొంచెం పెరిగినా, తగ్గినా బైకర్ పరిస్థితి ఏంటో ఊహించడం పెద్ద కష్టం కాదు (risky bike riding). ఆ స్టంట్‌ను అతడి స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి ఆ బైకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని మూర్ఖత్వం అంటారని, అతడు మరణాన్ని ఆహ్వానిస్తున్నాడని ఒకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..