Share News

సరికొత్తగా అమెరికా స్వరూపం.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాతో కూడిన మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్..

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:47 PM

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఐరోపా దేశాలు ఎప్పటిలా వంత పాడడం లేదు. ట్రంప్ ఆలోచన తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సరికొత్తగా అమెరికా స్వరూపం.. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాతో కూడిన మ్యాప్‌ను షేర్ చేసిన ట్రంప్..
Trump controversial map

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు. అయితే ట్రంప్ ప్రయత్నాలకు ఐరోపా దేశాలు ఎప్పటిలా వంత పాడడం లేదు. ట్రంప్ ఆలోచన తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ వాణిజ్య సుంకాలతో బెదిరిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి (Trump controversial map).


కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలాలను కలిగి ఉన్న అమెరికా మ్యాప్‌ను ట్రంప్ తాజాగా పోస్ట్ చేశారు. ఆ మ్యాప్‌ను ఏఐ ద్వారా రూపొందించారు. ఓవల్ ఆఫీసులో నాటో నాయకులతో ట్రంప్ సమావేశంలో ఉన్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఆ ఫొటోలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి నాయకులు ఉన్నారు (Trump AI-generated map).


పక్కనే ఉన్న అమెరికా మ్యాప్ సరికొత్తగా కనిపిస్తోంది. కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనెజువెలా కూడా అమెరికాలో భాగమే అన్నట్టు ఆ మ్యాప్‌లో ఉంది. ఇక, 'గ్రీన్‌ల్యాండ్, యూఎస్ టెరిటరీ, ఎస్ట్. 2026' అని రాసి ఉన్న ప్రాంతంపై తాను, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అమెరికా జెండాను నాటుతున్న మరో ఫొటోను కూడా ట్రంప్ పంచుకున్నారు.

trump2.jpg


కాగా, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేయాలని ట్రంప్ కామెంట్లు చేస్తున్నారు (Canada US territory). అయితే కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే ట్రంప్ సూచనను గతేడాది మే నెలలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. కోరికలకు, వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..


మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 04:51 PM