నీళ్ల కోసం బస్సు ఆపిన కొండముచ్చులు.. వైరల్‌గా మారిన వీడియో..
ABN , Publish Date - May 21 , 2026 | 07:01 PM
మండే వేసవి కారణంగా మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఎండల కారణంగా మూగ జీవాలు ఎంతలా ఇబ్బందిపడుతున్నాయో కళ్లకు కట్టే సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ముంబై, మే 21: మండే వేసవి కారణంగా మనుషులే కాదు.. మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఎండల కారణంగా మూగ జీవాలు ఎంతలా ఇబ్బందిపడుతున్నాయో కళ్లకు కట్టే సంఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దాహంతో అల్లాడిపోతున్న కొండముచ్చులు రోడ్డుపై వెళుతున్న బస్సును ఆపాయి. కొండముచ్చుల బాధ అర్థం చేసుకున్న ప్రయాణికులు తాగడానికి నీళ్లు ఇచ్చారు. బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యవాత్మాల్ జిల్లా ఖందాలా ఘాట్‌లో ఓ బస్సు వెళుతోంది. ఓ కొండముచ్చు సడెన్‌గా రోడ్డు మధ్యలోకి వచ్చి బస్సుకు అడ్డంగా కూర్చుంది. దీంతో డ్రైవర్ బస్సును ఆపేశాడు. డ్రైవర్, బస్సులోని ప్రయాణికులు దాన్ని పక్కకు తరమడానికి ప్రయత్నించారు. అయితే, అది పక్కకు వెళ్లలేదు. బస్సుకు అతి దగ్గరగా వచ్చి కూర్చుంది. కొండముచ్చు పరిస్థితి గమనించిన ఓ ప్రయాణికుడు నీళ్ల బాటిల్ దానికి అందించాడు. అది వెంటనే బాటిల్ తీసుకుని నీళ్లు తాగేసింది. కొన్ని క్షణాల్లో పెద్ద సంఖ్యలో కొండముచ్చులు అక్కడికి వచ్చాయి.
ఆ కొండముచ్చులన్నీ దాహంతో ఉన్నాయని గుర్తించిన ప్రయాణికులు తమ బాటిళ్లతో వాటికి నీళ్లు పోశారు. కొండముచ్చులు నీళ్లు తాగిన తర్వాత బస్సు అక్కడినుంచి కదిలింది. ప్రయాణికులు కొండముచ్చులకు నీళ్లు తాగిస్తున్న దృశ్యాలను ఓ మహిళ వీడియో తీసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. కొండముచ్చులకు నీళ్లు తాగించిన ప్రయాణికులపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సారా టెండూల్కర్‌పై బాడీ షేమింగ్ పోస్ట్.. ఆమె స్పందన ఏంటంటే..
రాజారెడ్డి హత్య కేసుపై పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్‌పై తీవ్ర ఆరోపణలు