సారా టెండూల్కర్‌పై బాడీ షేమింగ్ పోస్ట్.. ఆమె స్పందన ఏంటంటే..
ABN , Publish Date - May 21 , 2026 | 06:45 PM
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా జరిగిన బాడీ షేమింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఒక సోషల్ మీడియా అకౌంట్‌లో సారాను, ఆమె సోదరుడి భార్యను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో వీడియోను షేర్ చేయడంతో వివాదం చెలరేగింది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా జరిగిన బాడీ షేమింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఒక సోషల్ మీడియా అకౌంట్‌లో సారాను, ఆమె సోదరుడి భార్యను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో వీడియోను షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. సారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్టును షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది (Sara Tendulkar body shaming).
సారా, ఆమె సోదురుడి భార్య నడిచి వెళ్తుండగా తీసిన వీడియోను షేర్ చేస్తూ ఓ వెబ్ మీడియా జర్నలిస్ట్.. 'లావుగా ఉన్నది సారా.. పక్కన ఉన్నది ఆమె సోదరుడి భార్య' అని కామెంట్ చేశారు. ఆ వీడియో సారా దృష్టికి వెళ్లింది. ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన సారా ఆగ్రహం వ్యక్తం చేసింది (Celebrity body shaming).

'ఇది చాలా అసహ్యకరమైన కామెంట్. ఇది జర్నలిజం కాదు (Sachin Tendulkar daughter). మమ్మల్ని ఇలా వదిలేయండి. మీరు తర్వాత ఈ పోస్ట్‌ను డిలీట్ చేయవచ్చు. అంత మాత్రాన మీరు మీ తప్పును సరిదిద్దుకున్నట్టు కాదు' అని సారా పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది నెటిజన్లు సారాకు మద్దతుగా నిలుస్తూ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం తప్పు అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..