నల్ల కుక్క ఎంత పని చేసింది.. తమ్ముడితో పాటు వెళుతున్న 11 ఏళ్ల బాలికను..
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:22 PM
తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై, మార్చి 26: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ్ముడితో పాటు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. విచక్షణా రహితంగా ఆమెను గాయపరిచింది. స్థానికుల ఎంట్రీతో బాలికను వదిలి ఆ కుక్క పారిపోయింది. లేదంటే బాలిక ప్రాణాలు పోయేవి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. థానే జిల్లా, అంబర్‌నాథ్‌లోని వంశిక నగర్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక 24వ తేదీ సాయంత్రం తమ్ముడిని స్కూలు నుంచి ఇంటికి తీసుకువస్తోంది.
తమ్ముడి బ్యాగును బాలిక భుజాన తగిలించుకుంది. అక్కాతమ్ముళ్లు వీధిలో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వీధి కుక్క బాలికపై దాడికి దిగింది. భయపడిపోయిన బాలిక తమ్ముడు అక్కడినుంచి పారిపోయాడు. కుక్క బాలికపై విచక్షణా రహితంగా దాడి చేయటం మొదలెట్టింది. బాలిక ప్రాణ భయంతో కేకలు వేయసాగింది. ఆ అరుపులు విన్న కొంతమంది మహిళలు పరుగున అక్కడికి వచ్చారు. వారిని చూసిన కుక్క అక్కడినుంచి పారిపోయింది. స్థానికులు కుక్క దాడిలో గాయపడ్డ బాలికను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు’..‘కొద్దిరోజుల క్రితం 9 ఏళ్ల ఓ బాలిక రేబీస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది’..‘ప్రతీ రోజు ఎక్కడో చోట మనుషులపై వీధి కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్
జంక్ ఫుడ్‌కు బదులు ఇవి తినండి..