ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన రాణి.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:08 PM
థాయ్‌లాండ్ రాణి సుథీతా పైలట్‌గా మరో మైలురాయిని అధిగమించారు. గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపి ప్రశంసలు అందుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ రాణి సుథీతా పైలట్‌గా మరో మైలురాయిని అధిగమించారు. గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపి ప్రశంసలు అందుకున్నారు. అక్టోబర్ 7న థానీ ప్రావిన్స్‌లోని వింగ్ 7 వైమానిక స్థావరం నుంచి ఆమె గ్రిపెన్ విమానంలో దూసుకెళ్లారు. థాయ్ రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్ చూస్తుండగా ఈ సాహసకృత్యాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజు ప్రశంసలను కూడా అందుకున్నారు. ఆమెకు రాజు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
పైలట్‌గా రాణి సుథీతాకు విశేష అనుభవం ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆమె దాదాపు 16 ఏళ్లుగా పైలట్‌గా ఉన్నారు. తొలుత ఎయిర్‌హోస్టస్‌గా పనిచేసిన ఆమె ఆ తరువాత పైలట్ శిక్షణ పూర్తి చేశారు. పలు రకాల విమానాలను నడిపారు. సెస్నా వంటి స్వల్ప శ్రేణి విమానాలు మొదలు బోయింగ్ 737 వంటి కమర్షియల్ ప్యాసింజర్ జెట్స్‌ను నడిపిన అనుభవం రాణికి ఉంది. విదేశీ యాత్ర సమయంలో సొంతంగా విమానాన్ని నడిపే రాజు పక్కన ఆమె పలుమార్లు కోపైలట్‌గా వ్యవహరించారు.
తాజాగా యుద్ధ విమానాన్ని కూడా నడిపి తన పైలట్ కెరీర్‌లో సరికొత్త మైలురాయిని అధిగమించారు. థాయ్‌లాండ్‌లో గ్రిపెన్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించారు. ఆమె 2019లో సుథీద రాజు మహా వజ్రలాంగ్‌కోర్న్‌ను వివాహమాడారు.
ఈ వార్తలనూ చదవండి:
61 ఏళ్ల వయసులో మహిళ ప్రపంచ రికార్డు.. 5 గంటల పాటు ప్లాంక్
ఏఐని నమ్మి కొండెక్కాడు.. మధ్యలో షాకింగ్ ట్విస్ట్..