Share News

కోలుకున్న తల్లి.. మొక్కు తీర్చేందుకు తనయుడి పరుగులు

ABN , Publish Date - Oct 23 , 2026 | 04:03 PM

అనారోగ్యం బారిన పడ్డ తన తల్లి కోలుకుంటే పరుగులు తీస్తూ వెళ్లి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని ఓ బిహారీ టీనేజర్ మొక్కుకున్నాడు. ఆమె కోలుకోవడంతో పరుగు ప్రారంభించిన అతడు ఇప్పటివరకూ 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించాడు.

కోలుకున్న తల్లి.. మొక్కు తీర్చేందుకు తనయుడి పరుగులు
Monu Methurbala

ఇంటర్నెట్ డెస్క్: తల్లే ప్రపంచంగా బతుకుతున్న ఓ టీనేజర్ ఆమె అనారోగ్యం బారినపడటంతో భయపడిపోయాడు. ఆ భయంలోనే అతడు ఎవ్వరూ ఊహించని మొక్కు మొక్కుకున్నాడు. తల్లి మళ్లీ కోలుకోవడంతో అతడి సంతోషానికి అంతే లేకుండా పోయింది. మాట ప్రకారం మొక్కు చెల్లించేందుకు సిద్ధమైన అతడు దేశవ్యాప్తంగా పరుగులు తీయడం ప్రారంభించాడు. ఇప్పటివరకూ 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించాడు.


మొక్కు చెల్లించేందుకు ఇలా పరుగులు పెడుతున్న ఆ టీనేజర్ పేరు మోనూ మేతుర్‌బాలా. వయసు 19 ఏళ్లు. బిహార్‌లోని ఆరియా ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలం క్రితం మోనూ తల్లి లాల్తీ దేవీ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డారు. గొంతులో చేపముల్లు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షిణించసాగింది. ఎన్ని ఆసుపత్రల్లు చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, భయపడిపోయిన మోనూ భగవంతుడిని ప్రార్థించాడు. తల్లి కోలుకున్నాక తాను పరుగులు తీస్తూ ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించుకుంటానని మొక్కుకున్నాడు. దేవుడు కరుణించడంతో అతడి తల్లి గండం నుంచి గట్టెక్కింది. దీంతో, మోనూ సంబరపడిపోతూ మొక్కు చెల్లించుకునేందుకు ఈ ఏడాడి మార్చ్ 15న పట్నా నుంచి బయలుదేరాడు.


మోనూ ఇప్పటివరకూ 8 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించాడు. పరుగులు తీస్తూనే ఆరు జ్యోతిర్లింగాలను సందర్శించుకున్నాడు. రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంటాడు. మోనూకు మద్దతుగా మరో ఇద్దరు వ్యక్తులు అతడి వెంటే ప్రయాణిస్తున్నారు. తన కోసం తనయుడు పడుతున్న తపన చూసి అతడి తల్లి మురిసిపోయారు. కొడుకు ప్రయాణం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.


మోనూది పేద కుటుంబం. కుటుంబానికి సాయంగా ఉండేందుకు అతడు పానీ పురీలు విక్రయిస్తాడు. ఎలక్ట్రీషియన్ అయిన తండ్రి మహేశ్ చోహాన్‌కూ చేదోడువాదోడుగా ఉంటాడు. అతడి సోదరుడు సోనూ కూడా ఎలక్ట్రీషియన్‌యే. తన కొడుకు మోనూకు చిన్నప్పటి నుంచీ భక్తి ఎక్కువేనని మహేశ్ చౌహాన్ తెలిపారు. కానీ ఇంతటి సాహసానికి పూనుకుంటాడని మాత్రం తాను ఎన్నడూ అనుకోలేదని చెప్పారు.

క్రికెట్‌పై ఆసక్తి ఉన్న మోనూ 8 తరగతి నుంచి తన ఫిట్‌నెట్‌పై శ్రద్ధ పెట్టాడు. ప్రస్తుత ప్రయాణంలో ఇది తనకు ఎంతో ఉపకరిస్తోందని అన్నాడు. మొక్కు చెల్లించుకునేందుకు బయలుదేరిన అతడికి మహేశ్ తనకు చేతనైన మేర సాయం చేశాడు. ప్రస్తుతం మాత్రం మోనూ తనకు కావాల్సిన డబ్బులను తనే సమకూర్చుకుంటున్నాడు. ఇప్పటికే ఆరు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అతడు మొక్కు పూర్తయ్యాకే తిరిగి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు.


ఈ వార్తలనూ చదవండి:

నేను తప్పు చేశానా? ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసిన మహిళ పోస్టు

భర్తకు దూరంగా కూర్చున్నందుకు.. విమానంలో మహిళ రోదన.. వీడియో వైరల్

Updated Date - Oct 23 , 2026 | 04:07 PM