Share News

అభిమాని అత్యుత్సాహం.. భయపడిపోయిన మమతా బెనర్జీ..

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:54 PM

గురువారం జల్పాయ్‌గురిలో మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో మమతాను భయపెట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది కూడా ఓ అభిమాని కారణంగా మమతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అభిమాని అత్యుత్సాహం.. భయపడిపోయిన మమతా బెనర్జీ..
Mamata Banerjee security breach

కోల్‌కతా, ఏప్రిల్ 17: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నిన్న (గురువారం) జల్పాయ్‌గురిలో మమతా పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో మమతాను భయపెట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అది కూడా ఓ అభిమాని కారణంగా మమతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


జల్పాయ్‌గురిలో మమతా బెనర్జీ పాదయాత్ర చేస్తున్నారు. ఆమె చుట్టూ పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. జనం మమతా వైపు రాకుండా ఉండేందుకు రోడ్డుకు ఇరు వైపులా తాళ్లు సైతం కట్టి ఉన్నాయి. మమతా తన చుట్టూ ఉన్న జనానికి అభివాదం చేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాడును దాటి.. సెక్యూరిటీ సిబ్బందిని దాటి మమతా దగ్గరకు వచ్చేశాడు.


ఆమె కాళ్లపై పడి మొక్కాలని భావించాడు. అయితే, ఈ ఊహించని పరిణామంతో మమతా బెనర్జీ చాలా భయపడిపోయారు. భయంతో వెనక్కు పరిగెత్తారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టేసుకున్నారు. అక్కడినుంచి తాడు అవతలికి తీసుకెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో మమతా కొన్ని నిమిషాల పాటు పాదయాత్ర ఆపేశారు. అక్కడే నిలబడి పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్ట్ షాక్.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని ఆదేశం

అల్లు అర్జున్ పిటిషన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు..

Updated Date - Apr 17 , 2026 | 06:04 PM