రెసిడెన్షియల్ సొసైటీలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి..
ABN , Publish Date - Sep 04 , 2026 | 09:48 AM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ మహిళ ధైర్యం చేయటంతో పాప ప్రాణాలతో బయటపడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ మహిళ ధైర్యం చేయటంతో పాప ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్, రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటున్న ఓ బాలిక సెప్టెంబర్ 1వ తేదీన పరిగెత్తుకుంటూ బేస్‌మెంట్ ఎంట్రీ దగ్గరకు వచ్చింది. అక్కడ ఓ మూడు కుక్కలు నిల్చుని ఉన్నాయి.
మొదటగా ఓ తెల్లకుక్క పాపపై దాడి చేసింది. పాప స్కర్ట్‌ను గట్టిగా పట్టిలాగి కిందపడేసింది. దీంతో మిగిలిన రెండు కుక్కలు కూడా పాపపై విరుచుకుపడ్డాయి. మూకుమ్మడిగా దాడి చేయటం మొదలెట్టాయి. అయితే, అక్కడే ఉన్న ఓ మహిళ వేగంగా స్పందించింది. గట్టిగా అరుస్తూ పాపకు సాయంగా వచ్చింది. భయపడిపోయిన కుక్కలు పాపను వదిలి అక్కడినుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో పాపకు గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు పాపను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్
సీజ్ చేసిన సిగరెట్ల విక్రయం.. భాకరాపేట ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్