Share News

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పిల్లాడిపై వీధి కుక్క దాడి..

ABN , Publish Date - Mar 20 , 2026 | 08:03 PM

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క అతడి ప్యాంట్ పట్టుకుని లాగడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు గాయాలు అయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న పిల్లాడిపై వీధి కుక్క దాడి..
Himachal Pradesh stray dog attack

ఇంటర్‌నెట్ డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క అతడి ప్యాంట్ పట్టుకుని లాగడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హమీర్‌పూర్ జిల్లాలోని సుజన్‌పూర్‌కు చెందిన ఓ బాలుడు తన తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఓ వీధి కుక్క వారి వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. నేరుగా బాలుడి దగ్గరకు వెళ్లింది.


మెరుపు వేగంతో అతడి ప్యాంట్ పట్టుకుని లాగింది. అంతే.. ఆ బాలుడు ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. బాలుడు కిందపడ్డా ఆ కుక్క అతడిని వదల్లేదు. ప్యాంట్‌ను అటు, ఇటు లాగసాగింది. బాలుడి అరుపులు విన్న తల్లి వెంటనే వెనక్కు తిరిగింది. కుక్కపై గట్టిగా అరిచింది. ఆమె అరవటంతో కుక్క భయపడిపోయింది. అక్కడినుంచి పారిపోయింది. తల్లి బాలుడిని పైకి లేపింది. కుక్క కారణంగా బాలుడి ముఖానికి గాయాలు అయ్యాయి. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.


ఆ దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు జంతు ప్రేమికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నేను మళ్లీ చెబుతున్నాను.. దేశంలోని వీధి కుక్కలన్నింటిని చంపేయాలి. వాటి మాంసాన్ని చైనా, వియత్నాం దేశాలకు అమ్మాలి. ఆ డబ్బులను పేదల కోసం వాడాలి. ఛీ.. కుక్కల కంటే పిల్లులు ఎంతో నయం’..‘కుక్కలను ఇష్టపడే వారు .. వాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి’..‘ఈ మధ్య కాలంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కర్నూలు జిల్లాలో హోరాహోరీగా పిడకల సమరం.. దీని ప్రత్యేకత తెలుసా.?

గ్యాస్ కొరత లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్

Updated Date - Mar 20 , 2026 | 08:48 PM