దేశంలో బిజినెస్ స్కూళ్లను మూసేస్తే బెటర్: శ్రీధర్ వెంబు
ABN , Publish Date - Oct 30 , 2026 | 09:33 PM
దేశానికి ప్రస్తుతం మరో తరం ఎంబీయే పట్టభద్రులకంటే స్టార్టప్ వ్యవస్థాపకులు, ఔత్సాహిక వ్యాపారవేత్తల అవసరం ఉందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశానికి ప్రస్తుతం మరో తరం ఎంబీయే పట్టభద్రులకంటే ఔత్సాహిక వ్యాపారవేత్తలు, వారికి మార్గదర్శకంగా ఉండే స్టార్టప్ ఇంక్యుబేటర్ల అవసరం ఉందని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అభిప్రాయపడ్డారు. కాబట్టి, దేశంలోని బిజినెస్ స్కూళ్లను మూసేస్తే మంచిందని సూచించారు. బిజినెస్ స్కూల్స్‌ను మూసేస్తే మంచిదంటూ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ జడ్జి స్కూల్ ప్రొఫెసర్ క్రిస్ మార్కీ షేర్ చేసిన పోస్టుపై శ్రీధర్ వెంబు ఈ మేరకు కామెంట్ చేశారు.
‘ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా నేను ఇదే చెబుతున్నాను. బిజినెస్ స్కూల్స్‌ను మూసేసి స్టార్టప్ ఇంక్యుబేటర్లపై దృష్టి పెడితే దేశానికి ప్రయోజనం. మనకు ఇప్పుడు దేశంలో భారీ స్థాయిలో స్టార్టప్ సంస్థలు కావాలి. కొత్త కొత్త ప్రయోగాలు జరగాలి’ అని అన్నారు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరిగింది. జనాలు తమకున్న రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే, స్టార్టప్ ఇంక్యుబేటర్లకు, ఎంబీయే కాలేజీలకు మధ్య పోటీ పెట్టాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. బిజినెస్ స్కూల్లో స్టార్టప్‌లపై అధిక దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలన్న కోరిక నేటి తరం ఎంబీయే గ్రాడ్యుయేట్లల్లో లేదని కొందరు కామెంట్ చేశారు. సగం బిజినెస్ స్కూళ్లను మూసేసి వాటి స్థానంలో స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగారాన్ని అమ్ముతున్నారా? అయితే..
పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..