Share News

ఏఐతో ఇమేజ్ క్రియేట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:57 PM

ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.

ఏఐతో ఇమేజ్ క్రియేట్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు..
South Korea AI news

ఇంటర్‌నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. కొంతమంది ఏఐని మంచి పనులకు వాడుతుంటే.. మరి కొంతమంది జనాల్ని భయపెట్టడానికి వాడుతున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏఐని వాడుకుని.. పిచ్చిపిచ్చి వీడియోలు, ఇమేజ్‌లు తయారు చేస్తున్నారు. తాజాగా, ఏఐతో తోడేలు ఇమేజ్ క్రియేట్ చేసిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


ఏప్రిల్ 8వ తేదీన డాయిజిన్ సిటీలోని జూ నుంచి నియెక్‌గూ అనే 2 ఏళ్ల తోడేలు తప్పించుకుంది. దాని కోసం పోలీసులు, అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. జూకు దగ్గరగా ఉన్న స్కూళ్లను అధికారులు మూసి వేయించారు. ప్రజలు ఇళ్ల నుంచి అవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో తోడేలు నగరంలోని రోడ్డుపై తిరుగుతున్నట్లుగా ఉంది. అధికారుల దృష్టికి ఆ ఫొటో వెళ్లింది. దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.


పోలీసుల దర్యాప్తులో అది ఏఐతో తయారు చేసిన ఇమేజ్ అని తేలింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించాడన్న కారణంతో ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. కేవలం సరదా కోసమే ఆ ఇమేజ్ క్రియేట్ చేసినట్లు చెప్పటం గమనార్హం.


ఇవి కూడా చదవండి

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. మరోసారి సంక్షోభంలో పడ్డాయా..

ఐపీఎల్ 2026: 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీ.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?

Updated Date - Apr 25 , 2026 | 10:01 PM