వామ్మో.. క్రీమ్ రోల్స్‌ను ఎలా తయారు చేస్తున్నారో చూడండి.. తినడానికే భయపడతారేమో..
ABN , Publish Date - Mar 04 , 2026 | 08:44 AM
చాలా మంది బేకరీ ఫుడ్స్‌ను బాగా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలైతే మరింత ఎక్కువగా ఇష్టపడతారు. బేకరీల్లో దొరికే క్రీమ్ రోల్స్ చాలా మంది చిన్న పిల్లలు ఇష్టపడే ఫేవరెట్ స్నాక్. అయితే ఆ క్రీమ్ రోల్స్‌ను తయారు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది బేకరీ ఫుడ్స్‌ను బాగా ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలైతే మరింత ఎక్కువగా ఇష్టపడతారు. బేకరీల్లో దొరికే క్రీమ్ రోల్స్ చాలా మంది చిన్న పిల్లలు ఇష్టపడే ఫేవరెట్ స్నాక్. అయితే ఆ క్రీమ్ రోల్స్‌ను తయారు చేస్తున్న విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇకపై క్రీమ్ రోల్స్ తినడానికి కాస్త ఆలోచించకతప్పదు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Cream roll viral video).
@ChapraZila అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోల్‌లో క్రీమ్ నింపుతున్నాడు. ఆ రోల్ తయారు చేస్తున్న ప్రాంతం చాలా మురికిగా ఉంది. ఎటువంటి పారిశుధ్యం లేదు. ఆ వ్యక్తి రోల్ తీసుకుంటున్న ట్రే కూడా అపరిశుభ్రంగా ఉంది. అలాగే క్రీమ్‌ను నింపుతున్న యంత్రం కూడా మురికిగా ఉంది. ఆ వ్యక్తి తన చేతితోనే రోల్స్‌లో క్రీమ్ నింపుతున్నాడు. క్రీమ్ నింపిన రోల్స్‌ను నేలపై పరిచిన ఓ షీట్‌పై వేస్తున్నాడు (Cream roll making process).
ఈ తయారీ ప్రక్రియను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (Shocking food video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 1.25 లక్షల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోపై తన స్పందనలను తెలియజేశారు. 'ఇప్పటికీ నేను అప్పుడప్పుడు క్రీమ్ రోల్స్ తింటుంటాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎంత ఆకలితో ఉన్నా మళ్లీ తినను' అని ఒకరు కామెంట్ చేశారు. 'మనం బయట తినే చాలా ఆహార పదార్థాలు దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే తయారవుతాయి' అని మరొకరు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: