Share News

వారంలో 4 సార్లు ఆటోలో జర్నీ.. ప్రతిసారీ అదే సీన్ చూసి మహిళకు ఆందోళన

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:00 PM

మొబైల్ ఫోన్ లేనిదే క్షణం కూడా ఉండలేని స్థితికి చేరుకున్న వారి సంఖ్య పెరుగుతుండటంపై ఒక మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వారంలో 4 సార్లు ఆటోలో జర్నీ.. ప్రతిసారీ అదే సీన్ చూసి మహిళకు ఆందోళన
Rising Mobile Phone Addiction

ఇంటర్నెట్ డెస్క్: మొబైల్‌కు బానిసలుగా మారిన జనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని బెంగళూరుకు చెందిన ఒక ఆటోమోటివ్ ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై నెట్టింట చర్చ జరుగుతోంది.

గత వారంలో తాను దాదాపు నాలుగు సార్లు ఆటోల్లో ప్రయాణించానని ఆమె తెలిపారు. ప్రతిసారీ సుమారు 25 నిమిషాల పాటు జర్నీ చేశానని అన్నారు. ఆటోలో ప్రయాణించిన ప్రతిసారీ డ్రైవర్ వాహనాన్ని తోలుతూనే ఫోన్‌లో మాట్లాడుతున్న వైనాన్ని తాను గమనించానని అన్నారు. మొబైల్ ఫోన్స్‌పై ఇంతలా ఆధారపడుతున్న తీరు భవిష్యత్తులో తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కేవలం ఆటోడ్రైవర్లకే పరిమితం కాదని అన్నారు. షాపులు, సెలూన్‌లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూడా జనాలు నిత్యం ఫోన్లతో గడిపేస్తూ పనిపై అంతగా శ్రద్ధ పెట్టట్లేదని అన్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే దేశంలో సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న అనుమానం కలుగుతోందని అన్నారు.


ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. బెడ్‌రూమ్‌లో ఫోన్ వాడకపోవడం, డిన్నర్ చేసేటప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టడం, నోటిఫికేషన్స్‌ను సైలెంట్‌లో పెట్టడం, స్క్రీన్‌లో రంగులు తగ్గించేలా గ్రే స్కేల్ మోడ్‌‌ను ఎంచుకోవడం వంటి వాటితో మనసుపై అదుపు సాధించి ఈ వ్యసనం నుంచి బయటపడవచ్చని అంటున్నారు. యాప్ బ్లాకర్స్ వంటి వాటితో ఫోన్‌ వినియోగంపై పరిమితులు కూడా విధించుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.


ఈ వార్తలూ చదవండి:

బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..

Updated Date - Mar 07 , 2026 | 10:11 PM