Share News

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:42 PM

తన కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తూ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..
viral marriage proposal video

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో లవ్ ప్రపోజల్స్, పెళ్లి ప్రస్తావనల తీరుతెన్నులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మనసుకు నచ్చిన వారిని ఇంప్రెస్ చేసేందుకు యువతీయువకులు నూతన ఒరవడులను సృష్టిస్తున్నారు. ఇదే కోవకు చెందిన ఒక ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా గర్ల్ ఫ్రెండ్ ఇంటి ముందు డ్యాన్స్‌ చేస్తూ తనను పెళ్లి చేసుకోమని ఆమెను కోరిన వైనం తాలూకు వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, యువకుడు తన కుటుంబంతో సహా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ సినిమాలోని ఓ పాటకు వారంతా ఇంటి ముందు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కింద నుంచే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇక బాల్కనీలో నిలబడి ఇదంతా చూస్తున్న యువతి కూడా తెగ మురిసిపోయింది. చుట్టుపక్కల వారికి కూడా ఇదంతా ఆసక్తికరంగా అనిపించింది.


ఇక ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే వివరాలు లేకపోయినా జనాలు మాత్రం వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు. యువకుడి వినూత్న ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందించారు. కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ముందు పెళ్లి ప్రస్తావన తేవడం తామెక్కడా చూడలేదని అన్నారు. కుటుంబ సభ్యులందరినీ వెంట తీసుకుని వచ్చాడంటే అతడి గర్ల్ ఫ్రెండ్ నిజంగా స్పెషల్ వ్యక్తేనని అభిప్రాయపడ్డారు. ఇది ముచ్చటగొలిపే దృశ్యమే అయినా తాము ఇలా అస్సలు చేయబోమని మరికొందరు చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరీ ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ వార్తలూ చదవండి:

30 అడుగుల లోతు ఉన్న బావిలో పడ్డ ఏనుగు! ఎలా బయటకు తీశారంటే..

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

Updated Date - Mar 07 , 2026 | 05:59 PM