Share News

Shocking WagonR Crash: టైర్ పంక్చర్.. గాల్లోకి లేచి ఇంట్లో పడ్డ కారు

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:50 AM

టైర్ పంక్షర్ అవ్వటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. గాల్లోకి సర్రున లేచి ఓ ఇంట్లో పడింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Shocking WagonR Crash: టైర్ పంక్చర్.. గాల్లోకి లేచి ఇంట్లో పడ్డ కారు
Shocking WagonR Crash

సాధారణంగా రన్నింగ్‌లో ఉన్న కారు టైర్ పంక్షర్ అయితే ఏమౌతుంది?. కారు ఠక్కున ఆగిపోతుంది. నూటికి తొంభై శాతం కేసుల్లో ఇదే జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు కారు వెళుతున్న వేగానికి టైర్ పంక్షర్ అయితే ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కారు అతి వేగంలో ఉన్నపుడు టైర్ పంక్షర్ అయితే కారు గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయే అవకాశం ఉంది. చాలా ఘటనల్లో ఇలా జరిగింది. తాజాగా టైర్ పంక్షర్ అవ్వటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. గాల్లోకి సర్రున లేచి ఓ ఇంట్లో పడింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జనవరి 1వ తేదీన మధ్యాహ్నం 3.51 గంటల సమయంలో మరకడ ప్రాంతంలో ఓ కారు రోడ్డుపై వెళుతూ ఉంది. వేగంగా పరుగులు తీస్తున్న ఆ కారు టైర్ ఒక్కసారిగా పంక్షర్ అయింది. కారు వెళుతున్న వేగానికి టైర్ పంక్షర్ అవ్వటంతో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కారు గాల్లోకి సర్రున లేచింది. కొన్ని మీటర్లు గాల్లోకి ఎగిరి దూరంగా ఉన్న ఓ ఇంటి ఆవరణలో పడిపోయింది. కారు గాల్లోకి ఎగిరి దూరంగా పడ్డా కూడా డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.


క్షేమంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆ ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వైరల్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘డ్రైవర్ అదృష్టవంతుడు. కొంచెం అటు, ఇటు అయినా ప్రాణాలు పోయేవి’.. ‘యాక్షన్ సినిమాలో సీన్ చూసినట్లుగా ఉంది. కారు అలా ఎలా గాల్లోకి లేచిందిరా బాబు’..‘ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు సత్యసాయి బాబా భక్తురాలు..

నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

Updated Date - Jan 06 , 2026 | 06:57 AM