Share News

బిజీ రోడ్డులో క్వాడ్ ‌బైక్‌పై చిన్న పిల్లల రైడింగ్.. నెటిజన్ల మండిపాటు..

ABN , Publish Date - Mar 21 , 2026 | 08:59 PM

ఓ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా క్వాడ్ బైక్ ( నాలుగు చక్రాలు ఉండే చిన్న పిల్లల వాహనం)పై హైదరాబాద్‌లోని బిజీ రోడ్డులో రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టాడు. అది కూడా బైక్ వెనకాల ఓ చిన్నారిని కూర్చోబెట్టుకుని మరీ క్వాడ్ బైక్ నడిపాడు.

బిజీ రోడ్డులో క్వాడ్ ‌బైక్‌పై చిన్న పిల్లల రైడింగ్.. నెటిజన్ల మండిపాటు..
Hyderabad viral video

హైదరాబాద్, మార్చి 21: అద్భుతంగా డ్రైవింగ్ తెలిసిన వాళ్లే భాగ్యనగరంలోని బిజీ రోడ్లపై బైక్ నడపటానికి ఇబ్బందిపడుతుంటారు. అరకొరగా డ్రైవింగ్ వచ్చిన వాళ్లయితే బైక్ తీసుకుని రోడ్డుపైకి రావటానికి ఒకటి పది సార్లు ఆలోచిస్తుంటారు. కానీ, ఓ పిల్లాడు ఏమాత్రం భయపడకుండా క్వాడ్ బైక్ ( నాలుగు చక్రాలు ఉండే చిన్న పిల్లల వాహనం)పై హైదరాబాద్‌లోని బిజీ రోడ్డులో రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టాడు. అది కూడా బైక్ వెనకాల ఓ చిన్నారిని కూర్చోబెట్టుకుని మరీ క్వాడ్ బైక్ నడిపాడు. ఈ సంఘటన శనివారం ఓల్డ్ సిటీలోని అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.


ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బాలుడు క్వాడ్ బైక్‌పై బిజీ రోడ్డులో దూసుకువెళుతున్నాడు. చుట్టూ పెద్ద బైక్‌లు వేగంగా దూసుకువెళుతున్నాయి. వాటి మధ్య ఆ బాలుడు ఏమాత్రం భయం లేకుండా క్వాడ్ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ బైక్ వెనకాలి సీటులో ఓ బాలిక కూర్చుని ఉంది. ఆమె కూడా ఎలాంటి భయం లేకుండా రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇద్దరి వయసు 7 సంవత్సరాల కంటే తక్కువే ఉంటుందని సమాచారం.


ఇద్దరూ అలా క్వాడ్ బైక్‌పై వెళ్లటం చూసిన వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు రోడ్డుపై క్వాడ్ బైక్ నడపడాన్ని సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. ‘చిన్న పిల్లలకు ఆ బైక్ ఇచ్చి రోడ్డుపైకి పంపిన తల్లిదండ్రులను జైల్లో పెట్టాలి. వారికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి?’..‘ఆ పిల్లల తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటి. వాళ్లు ఏమైనా అయితే’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? ఇలా నియంత్రించండి

హోర్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు పలు దేశాల విజ్ఞప్తి..

Updated Date - Mar 21 , 2026 | 09:26 PM