రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఆకలి వేస్తుందా? ఇలా నియంత్రించండి
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:47 PM
రాత్రి భోజనం చేసిన మళ్లీ ఆకలి వేయడం చాలా మందికి సమస్యగా మారుతోంది. అయితే, రాత్రిపూట వచ్చే ఆకలిని ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: రాత్రి భోజనం చేసిన కొద్ది గంటలకే మళ్లీ ఆకలి వేయడం ఈ రోజుల్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సమయంలో జంక్ ఫుడ్ తినే అలవాటు ఆరోగ్యానికి హానికరం. అయితే రాత్రిపూట వచ్చే ఈ ఆకలిని సులభంగా ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
కడుపు నింపే భోజనం తినాలి
మీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఉండాలి. పప్పులు, గుడ్లు, పనీర్, చికెన్ వంటి ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. గోధుమలు, రాగి, బ్రౌన్ రైస్ వంటి ఆహారం శక్తిని నెమ్మదిగా ఇస్తుంది. చిన్న ఆరోగ్యకరమైన స్నాక్ తీసుకోండి.
భోజనం తర్వాత చాలా గ్యాప్ ఉంటే ఒక కప్పు పెరుగు, నట్స్ (బాదం, వాల్‌నట్స్), ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు, ఇవి ఆకలిని తగ్గిస్తాయి, జంక్ ఫుడ్ తినకుండా కాపాడతాయి. కొన్నిసార్లు దాహాన్ని కూడా ఆకలిగా భావిస్తాం. ముందుగా ఒక గ్లాసు నీరు తాగండి. 10–15 నిమిషాలు వేచి చూడండి. అవసరమైతే హెర్బల్ టీ తీసుకోవచ్చు. రాత్రిపూట ఆకలి రావడం సహజమే. కానీ సరైన ఆహారం, అలవాట్లతో దాన్ని నియంత్రించవచ్చు. చిన్న మార్పులతోనే జంక్ ఫుడ్ నుంచి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News