చీర కోసం తల్లి దారుణం.. కొడుకును 8వ అంతస్తునుంచి..
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:18 PM
చీర కోసం ఓ మహిళ కన్న కొడుకు ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది. 7వ అంతస్తులోని ప్లాట్ బాల్కనీలో పడ్డ చీరను తీయడానికి.. 8వ అంతస్తు మీద నుంచి కొడుకును చీరతో కట్టి కిందకు పంపింది. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: చీర కోసం ఓ మహిళ అత్యంత దారుణానికి ఒడిగట్టింది. కన్న కొడుకు ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది. 7వ అంతస్తులోని ప్లాట్ బాల్కనీలో పడ్డ చీరను తీయడానికి.. 8వ అంతస్తు మీద నుంచి కొడుకును చీరతో కట్టి కిందకు పంపింది. కొంచెం అటు, ఇటు అయినా కొడుకు ప్రాణం పోతుందని ఆ మహిళ ఆలోచన చేయకపోవటం గమనార్హం. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఫరియాబాద్ సెక్టార్ 82కు చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి 15 అంతస్తుల బిల్డింగ్‌లో నివాసం ఉంటోంది. మహిళ ఫ్లాట్ 8వ అంతస్తులో ఉంది. ఆ మహిళ కొద్దిరోజుల క్రితం తమ ఇంటి బాల్కనీలో చీరలు ఆరేసింది. ఓ చీర 7వ అంతస్తులోని ఫ్లాట్ బాల్కనీలో పడింది. ఆ చీరను తీయడానికి ఆ మహిళ దారుణమైన ఆలోచన చేసింది. కొడుకుకు చీర కట్టి 8వ అంతస్తునుంచి 7వ అంతస్తుకు పంపింది. కొడుకు చీర తీసుకున్న తర్వాత పైకిలాగింది.
ఈ భయానక దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అసలు ఆమె కన్నతల్లేనా?.. చీర కోసం కొడుకు ప్రాణాలను పణంగా పెడుతుందా?. చాలా దారుణం’..‘ఆ మహిళను అరెస్ట్ చేయాలి. ఇలాంటి వారు పిల్లలకు ప్రమాదకరం’..‘పిల్లాడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ప్రాణాలు పోయేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వివాదంలో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ పర్యటన.. కేంద్రం షోకాజ్ నోటీసు
రాజకీయ కారణాల వల్లే బాబర్‌ను ఆడిస్తున్నారు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్