హీరోయిన్ శిల్పా శెట్టి రెస్టారెంట్‌లో ఫ్రీ టిఫిన్.. అర కి.మీ మేర క్యూ కట్టిన జనం
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:12 PM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన ‘అమ్మకాయ్’ రెస్టారెంట్ ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఊహించని విధంగా భారీ ఎత్తున జనం రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై, జనవరి 27: దేశ వ్యాప్తంగా నిన్న(సోమవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి చెందిన ‘అమ్మకాయ్’ రెస్టారెంట్ ఓ బంపర్ ఆఫర్ పెట్టింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉచిత అల్పాహారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ణీత సమయంలో ఎంత మంది వచ్చినా వారికి ఉచిత అల్పాహారం అందిస్తామని తెలిపింది. దీంతో ఊహించని విధంగా భారీ ఎత్తున జనం రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. జనాలను చూసి రెస్టారెంట్ యజమాన్యం షాక్ అయ్యింది.
అర కిలోమీటర్‌కు పైగా క్యూ లైన్ ఏర్పడింది. జనం ఉదయం 7 గంటలకే రెస్టారెంట్ దగ్గరకు వచ్చేశారు. అయితే, 9.30 నుంచి 11.30 గంటల వరకు కొంతమందికి మాత్రమే ఉచిత అల్పాహారం దక్కింది. 11.30 గంటల తర్వాత వచ్చిన వారిని హోటల్ సిబ్బంది వెనక్కు పంపేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉచిత అల్పాహారం కోసం క్యూలైన్‌లో నిలబడ్డ వారిలో పేదవారి కంటే ఎక్కువగా డబ్బున్న వారే ఉన్నారు.
ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇండియాలో ఫ్రీ అంటే ఎగబడే జనాలకు లెక్కలేదు. ఫ్రీగా టిఫిన్ పెడుతున్నారని తెలియగానే డబ్బున్న వారు కూడా ఎగబడ్డారు. క్యూలైన్‌లో ఉన్నవారిని చూస్తుంటే ఎలన్ మస్క్ బంధువుల్లా ఉన్నారు. వారికి ఫ్రీ టిఫిన్ కోసం క్యూలైన్‌లో నిలబడాల్సిన అవసరం ఏముంది’..‘క్యూలైన్‌లో నిలబడ్డవారిలో పేద వాళ్లలా ఒక్కరు కూడా కనిపించటం లేదు’..‘ఫ్రీ అంటే చాలు జనాలు ఎగబడతారు. ఇదేం కర్మరా బాబు’..‘ ఫ్రీ అంటే ఎగబడే వారిని ఊరికే వదిలిపెట్టకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి..
ఇవి కూడా చదవండి
మీ పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరగడం లేదా? కారణాలను తెలుసుకోండి.!
మీ వాట్సాప్ ఛాట్‌ను మెటా చదవగలదా.. యూఎస్ కోర్టులో పిటిషన్..