మీ వాట్సాప్ చాట్‌ను మెటా చదవగలదా.. యూఎస్ కోర్టులో పిటిషన్..
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:21 PM
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ ఛాట్‌ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది.
వాట్సాప్ మెసేజింగ్ యాప్ అత్యంత సురక్షితమైనదని భావిస్తుంటాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీతో నడిచే వాట్సాప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి చదవడం అసాధ్యమని భావిస్తుంటాం. అయితే వాట్సాప్ చాట్‌ను దాని మాతృ సంస్థ 'మెటా' చదవగలదని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం వాదిస్తోంది. ఈ విషయంపై యూఎస్ కోర్టును ఆశ్రయించింది (Meta WhatsApp privacy lawsuit).
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతుంటుంది. యూజర్ల డేటా ఎక్కడా లీక్ కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. అయితే యాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఫీచర్ ఉన్నప్పటికీ ప్రైవేట్ మెసేజ్‌లను యాక్సెస్ చేసే అవకాశం మెటా ఉద్యోగులకు ఉంటుందని అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం ఆరోపించింది. మెటా ఉద్యోగులు తమ ఇంజినీరింగ్ బృందానికి 'టాస్క్' అనే సందేశం పంపగానే, యూజర్ల ఐడీ ద్వారా మెసేజ్‌లను చూసేందుకు వారికి యాక్సెస్ లభిస్తుందని పేర్కొంది (WhatsApp end-to-end encryption claim).
శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన అంతర్జాతీయ వాట్సప్ వినియోగదారుల బృందం తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వాదనను సమర్థించేలా ఎటువంటి ఆధారాలనూ కోర్టులో సమర్పించలేదు. కాగా, మెటా కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది (Meta denies WhatsApp access). వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నందున, సందేశాలను పంపేవారు, అందుకునేవారు మాత్రమే చదవగలరని వెల్లడించింది. ఎన్‌క్రిప్షన్ 'కీ'లు వినియోగదారుల మొబైల్స్‌లోనే ఉంటాయని, వాటిని వేరే వారు డీక్రిప్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..
చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..