Share News

మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి..

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:55 PM

ఒకప్పుడు నాసిక్‌లోని ‘సప్తశృంగి దేవి మాత’ దర్శనం అంటే భక్తులకు ఆయాసం, అలసట తప్పనిసరిగా ఉండేది.

మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి..

  • రైలులాంటిదే...

ఒకప్పుడు నాసిక్‌లోని ‘సప్తశృంగి దేవి మాత’ దర్శనం అంటే భక్తులకు ఆయాసం, అలసట తప్పనిసరిగా ఉండేది. కానీ అత్యాధునిక ‘ఫ్యూనిక్యులర్‌ ట్రాలీ’ రాకతో, భక్తులు కేవలం మూడు నిమిషాల్లోనే అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య సముద్ర మట్టానికి సుమారు 4,659 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శక్తిపీఠానికి చేరుకోవాలంటే సుమారు 500 మెట్లు ఎక్కడం తప్పనిసరి. అయితే భక్తుల సౌకర్యార్థం ‘ఫ్యూనిక్యులర్‌ ట్రాలీ’ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది గాలిలో ఊగిసలాడే రోప్‌వే కాదు.


కొండ వాలును ఆనుకుని ఉన్న రైలు పట్టాలపై, 36 డిగ్రీల నిటారు కోణంలో సాగే ఒక ఇంజనీరింగ్‌ అద్భుతం. ఇందులో ప్రయాణిస్తూ అద్దాల కిటీకీ లోంచి కిందకు చూస్తే... లోయలు, కనుచూపు మేరలో పరుచుకున్న పశ్చిమ కనుమల అందాలు కనువిందు చేస్తాయి. ఈ శక్తిపీఠానికి కాలినడకన మెట్లు ఎక్కడానికి గంట సమయం పడితే, ట్రాలీ మూడు నిమిషాల్లో చేరుస్తుంది. ట్రాలీ దిగిన తర్వాత కేవలం ఇరవై మెట్లు ఎక్కితే నేరుగా అమ్మవారిని దర్శించుకోవచ్చు.


book11.jpgఒక్కో ట్రిప్పులో సుమారు అరవై మంది ప్రయాణించొచ్చు. ఇక్కడ మొత్తం రెండు ట్రాలీలున్నాయి. ‘కౌంటర్‌ బ్యాలెన్స్‌’ పద్ధతిలో పనిచేస్తాయి. అంటే ఒకటి కొండ పైనుంచి కిందకు దిగుతుంటే, అదే సమయంలో రెండోది కింద నుంచి పైకి వెళ్తుంది. ‘భక్తిని, ప్రకృతి సౌందర్యాన్ని, ఆధునిక సౌకర్యాన్ని మేళవించిన ఫ్యూనిక్యులర్‌ ప్రయాణం అపూర్వం’ అంటున్నారు పర్యాటకులు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 05 , 2026 | 01:55 PM