Share News

కనిపించకుండా పోయిన సల్మాన్ ఇన్‌స్టా అకౌంట్.. ఆ 30 నిమిషాలు ఏమైంది?

ABN , Publish Date - May 25 , 2026 | 01:45 PM

సల్మాన్ ఇన్‌స్టా అకౌంట్‌లో ఏదో సమస్య తలెత్తింది. దాదాపు 30 నిమిషాల పాటు అకౌంట్ కనిపించకుండా పోయింది. ఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేసినపుడు.. ‘క్షమించండి.. ఈ పేజీ అందుబాటులో లేదు’ అని చూపించింది.

కనిపించకుండా పోయిన సల్మాన్ ఇన్‌స్టా అకౌంట్.. ఆ 30 నిమిషాలు ఏమైంది?
Salman Khan Instagram

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తరచుగా పోస్టులు పెడుతుంటారు. సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టాలో సల్మాన్‌కు 72 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోమవారం సల్మాన్ ఇన్‌స్టా అకౌంట్‌లో ఏదో సమస్య తలెత్తింది. దాదాపు 30 నిమిషాల పాటు అకౌంట్ కనిపించకుండా పోయింది. ఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేసినపుడు.. ‘క్షమించండి.. ఈ పేజీ అందుబాటులో లేదు’ అని చూపించింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి.

salman.jpg


సల్మాన్ ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయిందని కొంతమంది.. డిలీట్ అయిందని మరికొంతమంది ప్రచారం చేయటం మొదలెట్టారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్‌గా మారాయి. అయితే, దాదాపు 30 నిమిషాల తర్వాత అకౌంట్ మళ్లీ కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అకౌంట్ 30 నిమిషాల పాటు కనిపించకుండా పోవటంపై సల్మాన్ కానీ, ఆయన టీమ్ కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. టెక్నికల్ గ్లించ్ కారణంగా అకౌంట్ 30 నిమిషాల పాటు కనిపించకుండా పోయి ఉండొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

Updated Date - May 25 , 2026 | 01:50 PM