Zomato price difference: మార్కెట్లో రూ.320.. జొమాటోలో రూ.655.. మహిళ ప్రశ్నకు రిప్లై ఏంటంటే..
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:41 PM
సాధారణంగా నేరుగా హోటల్‌కు వెళ్లి తినడం కంటే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుందని అనుకుంటుంటాం. అయితే ఆ ధరలో తేడా ఎంత భారీగా ఉంటుందో తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం మహా నగరాల నుంచి ఓ మోస్తరు పట్టణాల వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ద్వారా ఇళ్లకే ఆహారం తెప్పించుకుని తింటున్నారు. సాధారణంగా నేరుగా హోటల్‌కు వెళ్లి తినడం కంటే ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుందని అనుకుంటుంటాం. అయితే ఆ ధరలో తేడా ఎంత భారీగా ఉంటుందో తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు (food cost higher on Zomato).
నళిని అనే మహిళ తన @NalinisKitche ఎక్స్ ఖాతా ద్వారా జొమాటోను ప్రశ్నించారు. ఆమె నేరుగా హోటల్‌కు వెళ్లి చైనీస్ బెల్ ఫుల్, వెజ్ మంచూరియా ఆర్డర్ చేశారు. అప్పుడు బిల్లు రూ.320 అయింది. అయితే అదే ఫుడ్‌ను జొమాటోలో ఆర్డర్ చేసే ఏకంగా రూ.655 చూపించింది. దీంతో ఖంగుతున్న ఆ మహిళ సోషల్ మీడియా ద్వారా జొమాటోను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. రెండు బిల్లుల ఫొటోలను షేర్ చేశారు. ధరలో ఇంత వ్యత్యాసం ఉండడం పూర్తిగా అన్యాయమని, కస్టమర్ల నుంచి స్పష్టంగా రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని కామెంట్ చేశారు (online food delivery pricing).
నళిని పోస్ట్‌పై జొమాటో స్పందించింది. ధరల వ్యత్యాసం బాధ్యతను రెస్టారెంట్లపై వేసింది (viral food price issue). 'హాయ్ నళిని, మా ప్లాట్‌ఫారమ్‌లోని ధరలను పూర్తిగా మా రెస్టారెంట్ భాగస్వాములు నిర్ణయిస్తారు. కస్టమర్‌లు, రెస్టారెంట్‌ల మధ్య మధ్యవర్తిగా మాత్రమే జొమాటో పనిచేస్తుంది. అయితే, మేము ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని రెస్టారెంట్ భాగస్వామికి పంపుతాము. దానిని పరిశీలించమని వారిని అభ్యర్థిస్తాము. ఏవైనా ఇతర సమస్యల కోసం మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము' అని రిప్లై ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
బాబా వంగా చెప్పింది నిజమవుతుందా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..
రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..