Share News

వామ్మో.. ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలా ఉంటుందా.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - May 19 , 2026 | 08:05 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఖడ్గ మృగానికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

వామ్మో.. ఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలా ఉంటుందా.. షాకింగ్ వీడియో వైరల్..
Assam rhino attack

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఖడ్గ మృగానికి సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Assam rhino attack).


అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. ఆ పార్క్‌కు సందర్శకులు జీప్‌లలో వెళ్లారు. జీప్ ఒక చోట ఆగి ఉండగా, అక్కడకు ఓ ఖడ్గ మృగం వచ్చింది. అది నేరుగా జీపు పైకి దూసుకెళ్లింది. తన కొమ్ముతో ఆ జీప్‌ను పైకి లేపి తోసేసింది. దానిని బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ జీప్‌లోని టూరిస్ట్‌లు భయంతో కేకలు వేశారు. అయితే ఆ జీప్ డ్రైవర్ మాత్రం ధైర్యం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించాడు. జీప్‌ను నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు (Manas National Park viral video).


ఈ ఘటనను వెనుక జీప్‌‌లోని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (rhino attacks safari jeep). ఖడ్గమృగాలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటాయి. అయితే అవి అభద్రతకు గురైనప్పుడు లేదా మనుషులు తమ వద్దకు వచ్చినప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తాయి. కాగా, ఆ వాహనం జంతువుకు అంత దగ్గరగా ఎలా వెళ్లగలిగిందో తెలుసుకోవడానికి అటవీ శాఖ ఈ మొత్తం ఘటనపై దర్యాప్తు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన


పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 19 , 2026 | 08:05 PM