నిప్పుతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది.. ఈ కుర్రాడి పరిస్థితి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:23 PM
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (Reel making madness).
@Nalanda_index అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడు నిప్పుతో ప్రమాదకర సాహసం చేసి గాయాలపాలయ్యాడు. వీడియో కోసం ఆ బాలుడు ఫైర్ స్టంట్ చేశాడు. తన నోటిలో కిరోసిన్ వేసుకుని ఎదురుగా ఉన్న మంటపైకి వెదజల్లాడు. అయితే ఆ మంటలు గాలిలోకి వెళ్లడానికి బదులుగా, వెనక్కి వచ్చి అతడి మొహాన్ని కాల్చి వేశాయి. అతడి మొహానికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను ఆర్పేందుకు చుట్టు ఉన్నవారు ప్రయత్నించారు. అయితే ఆ ప్రమాదంలో బాలుడి మొహం తీవ్రంగా కాలిపోయినట్టు తెలుస్తోంది (Child injured while making reel).
'రీల్స్ పిచ్చి ఈ ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్తోందో చూడండి (Dangerous reels trend). పిల్లలు కూడా ఈ పిచ్చిలో చిక్కుకున్నారు. ఆ మచ్చలు ఒక రోజులో లేదా నెలలో తగ్గిపోవు. అతడు జీవితాంతం వాటితోనే ఉండాల్సి ఉంటుంది' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వందల మంది ఆ వీడియోను వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..