రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి.. మీడియా, పిల్లలకు స్వీట్ బాక్స్‌లు పంచిన టీమ్..
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:54 PM
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది.
ఇంటర్‌నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నారు. గురువారం ఉదయం 10.10 గంటలకు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధు మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం మరో సారి పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. వివాహ వేదిక వద్ద అతిథులు ఎవరూ ఫోన్ ఉపయోగించకూడదనే నిబంధన ఉండడంతో వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు.
మీడియా, పిల్లలకు స్వీట్ బాక్స్‌ల పంపిణీ..
పెళ్లి వేడుక ముగిసిన తర్వాత కొత్త జంట టీమ్ స్వీట్ బాక్స్‌లను పంపిణీ చేసింది. వేదిక బయట ఉన్న మీడియా ప్రతినిధులతో పాటు చిన్న పిల్లలకు టీమ్ స్వీట్ బాక్స్‌లు పంచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలలో ఏముందంటే.. కొత్త జంట టీమ్‌లోని సభ్యులు రెండు పెద్ద అట్ట పెట్టెల నిండా స్వీట్ బాక్స్‌లు తీసుకుని వేదిక బయటకు వచ్చారు. వేదిక బయట ఉన్న మీడియా ప్రతినిధులు, చిన్న పిల్లలకు స్వీట్ బాక్స్‌లు పంచారు. ఆ స్వీట్ బాక్స్‌లపై రష్మిక మందన్న ఫొటో ఉంది.
గ్రాండ్‌గా రిసెప్షన్
మూడు రోజుల ముందునుంచే పెళ్లి సందడి మొదలైంది. విజయ్, రష్మికలు ఫిబ్రవరి 23వ తేదీనుంచే ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ వచ్చారు. 23, 24వ తేదీల్లో విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ జరిగింది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు సందడి చేశారు. పెళ్లి వేడుక చాలా కొద్ది మంది మధ్య ముగిసినా.. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా జరగనుంది. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి
చెపాక్ స్టేడియంలో ఆ సమస్యకు చెక్.. మైదానంలో ప్రత్యేక రసాయనం స్ప్రే
భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!