Share News

Rare Black Deer: అత్యంత అరుదైన దృశ్యం.. కనిపించిన నల్ల జింక..

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:54 PM

డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బుధవారం డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో ఓ అరుదైన నల్ల జింక ఆయనకు కనిపించింది. వెంటనే ఆయన ఫొటోలు, వీడియోలు తీశారు.

Rare Black Deer: అత్యంత అరుదైన దృశ్యం.. కనిపించిన నల్ల  జింక..
Rare Black Deer

పశ్చిమ బెంగాల్‌లోని కర్సియోంగ్ రేంజ్ డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో అపురూపమైన దృశ్యం వెలుగుచూసింది. అరుదైన నల్ల జింక ఒకటి అటవీ అధికారులకు కనిపించింది. డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ బుధవారం డౌన్ హిల్ ఫారెస్ట్ ఏరియాలో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో ఓ అరుదైన నల్ల జింక ఆయనకు కనిపించింది. వెంటనే ఆయన ఫొటోలు, వీడియోలు తీశారు. నల్ల జింకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, నల్ల జింక కనిపించటంపై అటవీ అధికారులు మాట్లాడుతూ.. ‘ఆ ప్రాంతంలో నల్ల జింక కనిపించటం సాధారణమైన విషయం కాదు.


జెనటిక్ మ్యూటేషన్ కారణంగా జింక చర్మం నల్లగా మారి ఉంటుంది. అది ప్రత్యేకమైన జాతికి చెందిన జింక కాదు. డౌన్ హిల్, బగోరా ఫారెస్ట్ ఏరియాలో నల్ల జింకలు కనిపించిన సంఘటనలు ఇది వరకు కూడా ఉన్నాయి. అది కూడా అత్యంత నిర్మానుష్యమైన ప్రదేశాల్లో మాత్రమే నల్ల జింకలు కనిపించాయి. ఇండియా మొత్తంలో నల్ల జింకలు అత్యంత అరుదుగా ఉన్నాయి’ అని అన్నారు. కాగా, ఇండియాలో చాలా రకాల జింక జాతులు నివసిస్తున్నాయి. మచ్చల జింక, సాంబార్ జింక, చిత్తడి జింక, మొరిగే జింక, కాశ్మీర్ జింక, మణిపూర్ సాంగై , కస్తూరి జింక, హోగ్ డీర్‌లు వివిధ అటవీ ప్రాంతాలలో కనిపిస్తాయి.


ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ జింక దూడ పిల్లలాగా కనిపిస్తోంది. జింకలాగా అస్సలు లేదు’..‘ఈ ప్రకృతిలో ఇలాంటి వింతలు చాలా దాగి ఉన్నాయి. అప్పుడప్పుడూ ఇలా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి’..‘నల్ల జింకను ఇప్పటి వరకు నేనెప్పుడూ చూడలేదు. నల్ల జింక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

శ్రీకాళహస్తిలో రెచ్చిపోయిన దుండగులు.. భారీగా నగదు చోరీ..

Updated Date - Jan 08 , 2026 | 01:20 PM