Share News

రణ్‌వీర్‌ పోలికలతో క్యూట్‌గా దువా.. ఫొటోలు వైరల్

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:58 PM

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె కుమార్తె దువా ఫొటోలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త ఫొటోల్లో దువా అచ్చం తండ్రి రణ్‌వీర్‌లాగే ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రణ్‌వీర్‌ పోలికలతో క్యూట్‌గా దువా.. ఫొటోలు వైరల్
Ranveer Singh Deepika Padukone Daughter Dua Pics Viral

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కుమార్తె దువా రెండో పుట్టినరోజు సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్ 8న దువా పుట్టినరోజు సందర్భంగా ఈ దంపతులు కొన్ని ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.


దీపిక ఇటీవల తన రెండో ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెటర్నిటీ షూట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా దువా పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న ఫొటోలను రణవీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. దువా అచ్చం తండ్రి రణవీర్‌లాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.


కొందరు అభిమానులు రణవీర్ చిన్ననాటి ఫొటోలను, దువా ఫొటోను కలిపి కొలాజ్‌గా తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. మరో అభిమాని స్పందిస్తూ.. మొదటి సంతానంగా అమ్మాయి పుడితే తండ్రికి అదృష్టం కలిసొస్తుందని అంటుంటారని, రణవీర్ విషయంలో అది నిజమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. దువా ఫొటోలు ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమెను చూసి రణవీర్ చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


రణవీర్‌, దీపిక 2018 నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకున్నారు. 2024 సెప్టెంబర్ 8న ఈ దంపతులు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌ 19న మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు రణ్‌వీర్‌, దీపికా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి చేసిన పోస్ట్‌లో.. దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉన్న ఫొటోను షేర్ చేశారు. తాజాగా దువా పుట్టినరోజు సందర్భంగా దీపిక మరోసారి బేబీ బంప్‌తో కనిపించారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

dia.jpg


Also Read:

చివరిసారిగా గంట మోగించిన ‘దాస్ అంకుల్‌’.. కన్నీళ్లతో విద్యార్థుల వీడ్కోలు!

కుట్రపూరితంగా సభను అడ్డుకోవాలని కుట్ర చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Sep 09 , 2026 | 05:16 PM