Share News

రోడ్డుపై స్కూటీ నేర్చుకుంటుండగా ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:06 PM

ఓ మహిళ స్కూటీ నేర్చుకోవడానికి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన స్కూటీ వేగంగా వెళ్లి షాపు షట్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళకు గాయాలు అయ్యాయి.

రోడ్డుపై స్కూటీ నేర్చుకుంటుండగా ప్రమాదం.. వైరల్‌గా మారిన వీడియో..
Rajkot viral video

ఇంటర్‌నెట్ డెస్క్: ఓ మహిళ స్కూటీ నేర్చుకోవడానికి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన స్కూటీ వేగంగా వెళ్లి షాపు షట్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్‌కు చెందిన ఓ మహిళ స్కూటీ నడపటం నేర్చుకుంటోంది. అయితే, ఆమె ఎవ్వరూ లేని ప్రదేశంలో కాకుండా బిజీ రోడ్డుపై స్కూటీ నేర్చుకోవటం మొదలెట్టింది.


గోవింద్‌బాగ్ కూరగాయల మార్కెట్ దగ్గర ఆ మహిళ యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే స్కూటీ నియంత్రణ కోల్పోయింది. నియంత్రణ కోల్పోయిన స్కూటీ ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి రోడ్డు పక్కన మూసి ఉన్న షాపు షట్టర్‌ను బలంగా ఢీకొట్టింది. స్కూటీ గాల్లోకి ఎగిరి పక్కకు పడిపోయింది. స్కూటీతో పాటు మహిళ దూరంగా ఎగిరిపడింది. ఆమెకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది.


ఇవి కూడా చదవండి

ఆసీస్‌పై ఘోర ఓటమి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ చారిత్రాత్మక ఘనత

శబరిమలలో తెలుగు స్వాముల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: భానుప్రకాశ్ రెడ్డి

Updated Date - Aug 23 , 2026 | 05:14 PM