నువ్వసలు మనిషివేనా.. రీల్ కోసం ఇంత నీచమా..
ABN , Publish Date - Feb 19 , 2026 | 09:26 PM
ఓ యువకుడు రీల్ కోసం దారుణమైన పని చేశాడు. చిన్న పిల్లాడికి సిగరెట్, మందు తాగించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది..
ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఓవర్‌నైట్‌లో స్టార్ అవ్వాలన్న అత్యాశతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. మరి కొంతమంది సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు రీల్ కోసం దారుణమైన పని చేశాడు. చిన్న పిల్లాడికి సిగరెట్, మందు తాగించాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఓ యువకుడు రోడ్డు పక్క బైక్ ఆపి దానిపై కూర్చున్నాడు. యువకుడి ముందు ఓ పిల్లాడు నిలబడి ఉన్నాడు. బాలుడి చేతిలో బీర్ టిన్ ఉంది. యువకుడు సిగరెట్ తాగి పిల్లాడికి ఇచ్చాడు. పిల్లాడు దాన్ని నోట్లో పెట్టుకుని దమ్ముకొట్టడానికి ప్రయత్నించాడు. అయితే బాలుడి వల్ల సాధ్యం కాక.. దాన్ని యువకుడికి ఇచ్చేశాడు. తర్వాత తన చేతిలో ఉన్న బీర్ తాగాడు. 15 సెకన్ల ఆ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఊరికే వదిలిపెట్టకూడదు’..‘చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేసే వారికి బుద్ధి ఉండాలి’..‘రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది. రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’..‘ఓవర్ నైట్‌లో సెలెబ్రిటీ అయిపోవడానికి ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు. ఇది మరీ దారుణం. ఆ వ్యక్తిని ఊరికే వదిలిపెట్టకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆంధ్రా మహిళ మృతదేహాన్ని స్వదేశానికి తరలించిన గల్ఫ్ టీడీపీ కార్యకర్తలు
మష్రూమ్ కర్రీ.. ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందో..