Share News

రైలు ఏసీని ఇలా వాడేశారేంట్రా.. డోరు విప్పి చూడగా షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 13 , 2026 | 09:41 AM

రైలులో ఏసీ కూలింగ్ సరిగా లేకపోతే.. సాంకేతిక లోపమో, నిర్వహణ సమస్యో అనుకుంటాం. కానీ ఓ రైలులో ఏసీ డక్ట్‌ను తెరిచి చూడగా బయటపడిన విషయం ప్రయాణికులను షాక్‌కు గురిచేసింది..

రైలు ఏసీని ఇలా వాడేశారేంట్రా.. డోరు విప్పి చూడగా షాకింగ్ సీన్..
Railway AC Coach

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ఏసీ సరిగా పనిచేయడం లేదంటూ ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తుంటారు. సాధారణంగా సాంకేతిక సమస్యలు లేదా నిర్వహణ లోపాలను ఇందుకు కారణాలుగా భావిస్తారు. అయితే, తాజాగా ఓ రైల్వే ఉద్యోగి షేర్ చేసిన వీడియో ఈ సమస్యకు మరో కారణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఏసీ నిర్వహణలో భాగంగా ఓ ఉద్యోగి రైలు కంపార్ట్‌మెంట్‌లోని ఎయిర్ డక్ట్‌ను తెరిచి తనిఖీ చేయగా.. లోపల భారీగా చెత్త పేరుకుపోయి ఉండటం కనిపించింది. టీ కప్పులు, చిప్స్ ప్యాకెట్లు, టోఫీ కవర్లు, ఇతర వ్యర్థాలు డక్ట్‌లో ఇరుక్కుపోయి కనిపించాయి.


ఈ చెత్త కారణంగా ఎయిర్ అవుట్‌లెట్‌లో గాలి ప్రసరణకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వీడియో ద్వారా స్పష్టమైంది. ప్రయాణికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కనీస పౌర బాధ్యత పాటించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. రైల్వే ఉద్యోగి చెత్తను డక్ట్ నుంచి తొలగిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏసీ సౌకర్యం సరిగా అందడం లేదని ఫిర్యాదు చేసే ముందు, ప్రయాణికులు రైళ్లలో పరిశుభ్రతను కాపాడేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పలువురు సూచిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 13 , 2026 | 11:39 AM