Share News

అదృష్టం అంటే ఇదీ.. రిజైన్ చేద్దామని అనుకుంటే లేఆఫ్..

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:16 PM

ఆఫీసులో పని సంస్కృతిని భరించలేక రాజీనామా చేద్దామనుకున్న తరుణంలో లేఆఫ్‌కు గురికావడం తనకు వరంలా మారిందంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

అదృష్టం అంటే ఇదీ.. రిజైన్ చేద్దామని అనుకుంటే లేఆఫ్..
Qualcomm Layoffs Viral Incident

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసులో పని సంస్కృతిని భరించలేక రాజీనామా చేద్దామనుకున్న తరుణంలో లేఆఫ్‌కు గురికావడం తనకు వరంలా మారిందంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల క్వాల్‌కామ్ సంస్థలో లేఆఫ్స్ ప్రకటించడంతో తాను జాబ్ కోల్పోయినట్టు ఆ టెకీ చెప్పారు. ఇది తనకు ఆయాచిత వరంగా మారిందని సంబరపడుతూ వ్యాఖ్యానించారు.

ఇటీవల క్వాల్‌కామ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ ప్రకటించింది. భారత్‌లో కూడా 1000 మందిపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆ టెకీ కూడా జాబ్ కోల్పోయారు. మొదట్లో వేరే నగరంలో సంస్థకు ఉన్న బ్రాంచ్‌లో పని చేసిన తాను ఇంటికి దగ్గరగా ఉండేందుకు వీలుగా అంతర్గత ట్రాన్సఫర్ చేయించుకున్నట్టు చెప్పారు.


అయితే, కొత్త కార్యాలయంలో మాత్రం పనిచేయలేకపోయినట్టు చెప్పారు. మేనేజ్‌మెంట్ వేధింపులు, సహోద్యోగుల నుంచి దక్కని సహకారం కారణంగా తప్పుకునేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. తానే స్వయంగా రాజీనామా చేసి ఉంటే ఉత్త చేతులతో సంస్థను వీడాల్సి వచ్చేదని చెప్పారు. కానీ ఈలోపే సంస్థ లేఆఫ్స్ ప్రకటించడంతో తానూ జాబ్ కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో 15 నెలల జీతం పరిహారంగా వచ్చిందని చెప్పారు. అసలు ఇంత ఎక్కువ మొత్తం ఎలా వచ్చిందో కూడా వివరించారు.


ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి ప్రామాణిక పరిహారం కింద మూడు నెలల జీతాన్ని కంపెనీ ఇస్తుందని ఆ టెకీ చెప్పారు. మూడు రోజుల లోపే ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేసినందుకు మరో నెల జీతం వచ్చిందని అన్నారు. అప్పటికే సంస్థలో తన సర్వీసును బట్టి మరో ఐదు నెలల జీతం కూడా ఇచ్చారని చెప్పారు. వాడుకోని సెలవులను క్యాష్ చేసుకున్నందుకు మరో నెల జీతం వస్తుందని చెప్పారు. ఇది చాలదన్నట్టు వచ్చే ఏడాది జనవరి వరకూ వచ్చే శాలరీని కలుపుకుంటే మొత్తం తనకు 15 నెలలు అధికంగా శాలరీ వచ్చినట్టు అవుతుందని చెప్పారు. ఇంత మొత్తంలో పరిహారం వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి తాను వెంటనే ఉద్యోగాన్వేషణ ప్రారంభించనని చెప్పారు. కొన్ని రోజులు కుటుంబంతో హ్యాపీగా గడిపాక తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తానని అన్నారు. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

సముద్ర గర్భం... కళాత్మకం!

లిప్ కిస్ కావాలంటూ విదేశీ యువతికి వేధింపులు.. వైరల్‌గా మారిన వీడియో..

Updated Date - Nov 15 , 2026 | 03:28 PM