మహారాష్ట్రలో దారుణం.. చంటిబిడ్డతో వెళుతున్న తల్లిపై వీధికుక్క దాడి..
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:27 PM
మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చంటిబిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ తల్లిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో భయపడిపోయిన తల్లి చంటిబిడ్డను నేలపై పడేసింది. కుక్క కారణంగా తల్లికి, బిడ్డకి గాయాలు అయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చంటిబిడ్డతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ తల్లిపై వీధికుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో భయపడిపోయిన తల్లి చంటిబిడ్డను నేలపై పడేసింది. కుక్క కారణంగా తల్లికి, బిడ్డకి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పుణెలోని ఓల్డ్ సంఘ్వీ ఏరియాలో ఓ మహిళ ఏడాది వయసున్న తన బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది.
ఓ ఇంటి ముందు ఆపి ఉన్న కారు చాటునుంచి ఓ కుక్క సడెన్‌గా బయటకు వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ కాలును గట్టిగా కొరికింది. ఈ హఠాత్పరిణామంతో మహిళ భయపడిపోయింది. బిడ్డను కిందకు జారవిడిచింది. దీంతో చిన్నారి రోడ్డుపై పడిపోయింది. తలకు గాయం అవటంతో ఏడవటం మొదలెట్టింది. కుక్క మళ్లీ దాడి చేస్తుందేమోనన్న భయంతో మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో కుక్క అక్కడినుంచి పారిపోయింది.
ఆమె వెంటనే ఏడుస్తున్న తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. మహిళ అరుపులు, ఏడుపులు విన్న స్థానికులు దగ్గరకు వచ్చారు. ఓ వ్యక్తి మహిళ చేతుల్లోంచి బిడ్డను తీసుకున్నాడు. ఓ ఇద్దరు మహిళలు నడవటానికి ఇబ్బంది పడుతున్న బాధితురాలిని అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోను వరద్ భత్కండే అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
ఏఐపై ఆందోళన.. భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు: బిల్ గేట్స్
జనవరి 1 నుంచి సంజీవని సేవలు: సీఎం చంద్రబాబు