నేను ఠాకూర్‌ని.. నాతో పెట్టుకుంటే.. బ్యాంకు మహిళా ఉద్యోగి రభస
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:13 PM
కుల ప్రస్తావన తెచ్చి కస్టమర్‌పై రెచ్చిపోయిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని వీడియో వైరల్‌గా మారింది. ఆమెపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఓ కస్టమర్‌పై ప్రైవేటు బ్యాంకు మహిళా ఉద్యోగి నోరు పారేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral Video) మారింది. ఆ ఉద్యోగిని తీరు చూసి జనాలు షాకైపోతున్నారు. కుల అహంకారాన్ని ప్రదర్శించారంటూ మండిపడుతున్నారు. యూపీలోని కాన్‌పూర్‌లో గల ఓ ప్రైవేటు బ్యాంకులో ఈ ఘటన వెలుగు చూసింది (I'm Thakur Says Female Employee).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆ ఉద్యోగిని పేరు ఆస్థా. ఓ కస్టమర్‌తో ఆమె తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడారు. ‘నేను ఠాకూర్‌ని, నాతో పెట్టుకోవద్దు. నీ అంతు చూస్తా’ అంటూ కస్టమర్‌కు ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకానొక దశలో ఆమె లాప్‌టాప్‌ను అవతలి వారిపై విసరబోతున్నట్టు పైకెత్తడం కూడా విమర్శలకు దారి తీసింది. ఈ క్రమంలో సహోద్యోగులు ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఆస్థా వెనక్కు తగ్గకపోగా రభస కొనసాగించారు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు మహిళా ఉద్యోగిపై విమర్శలు ఎక్కుపెట్టారు. బాధ్యతగల ఉద్యోగిగా ఆమె హుందాగా నడుచుకోలేదని విమర్శించారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ప్రైవేటు కంపెనీలపై ఉంటుందని అన్నారు. అయితే, అసలు ఈ వాగ్వివాదానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోపై బ్యాంకు కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. మరి నెట్టింట ఇంతలా వైరల్ అవుతున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
మెట్రో స్టేషన్‌లోనే తన కొడుకు నిశ్చితార్థాన్ని జరిపించిన తల్లి.. వైరల్ వీడియో
ఏఐని నమ్మి.. భార్య లాప్‌టాప్‌ను అప్పగిస్తే..