Share News

లిఫ్ట్‌లో భయానక సంఘటన.. ఒక్కసారిగా ఊడి తలపై పడ్డ అద్దం..

ABN , Publish Date - Mar 25 , 2026 | 09:12 PM

లిఫ్ట్‌లో వెళుతున్న ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ప్రమాదానికి గురవ్వటంతో అద్దం విరిగి అతడి తలపై పడింది. అతడి తలకు గాయం అయింది.

లిఫ్ట్‌లో భయానక సంఘటన.. ఒక్కసారిగా ఊడి తలపై పడ్డ అద్దం..
Gurugram lift accident

ఇంటర్‌నెట్ డెస్క్: లిఫ్ట్‌లో వెళుతున్న ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ప్రమాదానికి గురవ్వటంతో అద్దం విరిగి అతడి తలపై పడింది. అతడి తలకు గాయం అయింది. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత శనివారం గురుగ్రామ్‌, సెక్టార్ 70 ఏలోని పరాస్ ఇరేనేలో ఓ పూజారి లిఫ్ట్‌ ఎక్కాడు. లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కుదుపులకు గురవ్వసాగింది. ఈ నేపథ్యంలోనే ఓ పెద్ద కుదుపు రావటంతో లిఫ్ట్‌లో ఉన్న అద్దం విరిగి పూజారి తలపై పడి బద్ధలైంది.


ఈ హఠాత్పరిణామానికి పూజారి షాక్ అయ్యాడు. కొద్దిసేపు ఏం జరిగిందో ఆయనకు అర్థం కాలేదు. అటు, ఇటు చూస్తూ ఉండిపోయాడు. ఇక, ఈ ఘటనలో పూజారి తలకు గాయం అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీల తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి’..‘అపార్ట్‌మెంట్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోనూ..

మార్చి 3వ తేదీన గుజరాత్‌, వల్సాద్‌లోని ఓ భవనంలో 9వ అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్‌ ఎక్కాడు. అతడు దిగాల్సిన ఫ్లోర్ రాగానే తలుపులు తెరచుకున్నాయి. అతడు కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా లిఫ్ట్ క్షణాల్లో పైకి వెళ్లిపోయింది. సడెన్‌గా లిఫ్ట్ పైకి పోవడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ వెంటనే కిందకు పడిపోవటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.


ఇవి కూడా చదవండి

సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

Updated Date - Mar 25 , 2026 | 09:38 PM