భారత్ విషయంలో ఎందుకు ఈ ఎగతాళి? పోలాండ్ మహిళ అసంతృప్తి
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:19 PM
ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది.
ఇంటర్నె డెస్క్: ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనేక మంది ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
వాతావరణ మార్పులపై స్పందన విషయంలో ద్వంద్వం ప్రమాణాలు కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఐరోపాలో వడగాలులు వార్తలపై అనేక మంది సంఘీభావం ప్రకటించారని, భారత్‌లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు మాత్రం విమర్శలు, ఎగతాళి మాటలు వినిపించాయని అన్నారు. తాను ప్రస్తుతం పోలాండ్‌లోఉన్నానని, అక్కడి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటడంతో పరిస్థితి భరించలేని విధంగా ఉందని కామెంట్ చేశారు.
భారత్‌లో ఎండాకాలంలో వేడి 40 డిగ్రీలు దాటుతుంటుందని, కొన్ని చోట్ల 50 డిగ్రీలకు కూడా చేరువైన ఘటనలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయంగా సంఘీభావానికి బదులు విమర్శలు వినిపిస్తుంటాయని అన్నారు. భారత్‌లో వేడిని తట్టుకునేందుకు ప్రజలు ఆరుబయట నిద్రించే ఉదంతాల ఫొటోలు వైరల్ అయినప్పుడు ఎగతాళి మాటలు వినిపించేవని అన్నారు. కానీ ప్రస్తుతం ఐరోపాలో అదే దృశ్యాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో స్పందనలు మాత్రం భిన్నంగా ఉన్నాయని అన్నారు.
మౌలిక వసతుల పరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ వాతావరణ మార్పుల విషయంలో భారత్‌పై విమర్శలు తగవని అన్నారు. భారత్ సాధించిన విజయాలకు గుర్తింపు దక్కడటం లేదని కూడా చెప్పారు. ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న జనాలు పోలాండ్ మహిళ అభిప్రాయాలతో ఏకీభవించారు. భారత్ పరిష్కరించాల్సి సమస్యలు కూడా ఉన్నాయని మరికొందరు అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
5 రోజులు శిథిలాల కిందే.. వైరల్‌గా మారిన కుక్క పిల్ల వీడియో..
ముంబైలో షాకింగ్ ఘటన.. వర్షంలో విద్యార్థినులకు కరెంట్ షాక్.. చివరికి..