మా ఇంటికి చిట్టి ఫ్రెండ్ వచ్చాడు.. ప్రధాని మోదీ పోస్టు
ABN , Publish Date - Mar 22 , 2026 | 02:24 PM
మా ఇంటికి చిట్టి ఫ్రెండ్ వచ్చాడంటూ ప్రధాని మోదీ ఇటీవల షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ పోస్టుకు 1.7 మిలియన్ లైకులు వచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: తన ఇంటికి చిట్టి ఫ్రెండ్ ఒకరు వచ్చాడంటూ ప్రధాని మోదీ తాజాగా పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్నారిని ప్రధాని ఎత్తుకుని కబుర్లు చెబుతున్న ఈ ఫొటోకు 1.7 మిలియన్ లైకులు వచ్చాయి. ఎవరీ చిన్నారి అంటూ జనాలు కామెంట్ సెక్షన్‌ను హోరెత్తించారు.
ఆ ఫొటోలోని చిన్నారి పేరు అశ్విన్ కృష్ణ. కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణకుమార్ కూతురు దియా కృష్ణ కుమారుడే అశ్విన్. దియా కృష్ణ కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి పాప్యులారిటీ సాధించారు. కృష్ణకుమార్ తన కుటుంబంతో పాటు వచ్చి ప్రధాని మోదీని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్నారితో దిగిన ఫొటోను ప్రధాని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పోస్టుపై దియా కృష్ట కూడా స్పందించారు. ఇదో అరుదైన అవకాశమని, తమకు ఇదో ఫ్యాన్ మూమెంట్ అని కామెంట్ చేశారు. జీవితంలోని మర్చిపోలేని జ్ఞాపకమని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలూ చదవండి:
ఫ్లైట్‌లో మహిళ మృతి! ఎమర్జెన్సీ కాదని చెప్పి, 13.5 గంటల పాటు..
లండన్‌లో ఊహించని దృశ్యం.. ఆశ్చర్యపోతున్న భారతీయులు