Share News

లండన్‌లో ఊహించని దృశ్యం.. ఆశ్చర్యపోతున్న భారతీయులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:23 AM

లండన్‌ వీధుల్లో ఆటో దూసుకుపోయిన వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

లండన్‌లో ఊహించని దృశ్యం.. ఆశ్చర్యపోతున్న భారతీయులు
Indian auto London viral video

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో లండన్ ప్రధానమైనది. ఆధునికతకు, సాంకేతిక పురోగతికి పేరుగాంచిన ఈ నగరంలో ఇటీవల ఆవిష్కృతమైన ఒక దృశ్యం స్థానిక భారతీయులతో పాటు నెటిజన్‌లను అమితంగా ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

జై ఢొలాకియా అనే నెటిజన్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. భారతీయులకు చిరపరిచితమైన ఆటో లండన్‌ వీధుల్లో కూడా కనిపించిందని అన్నారు. ఈ సీన్ లండన్ లుక్‌ను మార్చేసిందని కామెంట్ చేశారు. అక్కడ సాధారణంగా కనిపించే వాహనాల పక్కన ఆటో దూసుకుపోతూ కనిపించడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఆ సీన్‌ను చూడగానే అది ఢిల్లీ నగరమా? అనే అనుమానం వచ్చిందని కొందరు కామెంట్ చేశారు. ఒకే ఫ్రేమ్‌లో రెండు భిన్న నేపథ్యాలు కనిపించినట్టు అయ్యిందని అన్నారు.


తాము గతంలో ఇలాంటి సీన్‌‌ను చూశామని మరికొందరు కామెంట్ చేశారు. వెంబ్లేలో తాను ఒకసారి ఆటోను చూసినట్టు ఒక వ్యక్తి తెలిపారు. ఇక మరికొందరు భారతీయులకు తాము స్వదేశంలో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. ఆటో ప్రయాణాలు అద్భుతమని వారు వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఇవీ చదవండి:

ఏంటీ.. ప్లంబర్ వార్షిక ఆదాయం రూ.18 లక్షలా!

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన రాఫ్టింగ్ బృందం.. వీడియో వైరల్

Updated Date - Mar 22 , 2026 | 09:35 AM