Share News

విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్.. చివరకు.?

ABN , Publish Date - Mar 09 , 2026 | 10:13 AM

విమాన ప్రయాణంలో ఓ ప్యాసింజర్ బీడీ కాల్చబోతూ అడ్డంగా దొరికిపోయాడు. సదరు విమానం ల్యాండ్ అయ్యాక అతడిని పోలీసులకు అప్పగించారు విమాన సిబ్బంది. అసలేం జరిగిందంటే..

విమానంలో బీడీ కాల్చిన ప్యాసింజర్.. చివరకు.?
Passenger Smoking in Flight

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణం అంటేనే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా బీడీ కాల్చడం అధికారులను కలవరపరిచింది. అతడి వద్ద బీడీలతో పాటు లైటర్‌ను చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. విమాన భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన సదరు ప్యాసింజర్‌పై అధికారులు కేసు నమోదు చేశారు.


ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఆకాశ QP 1625 విమానంలో ఆశిష్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ప్రయాణ సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన అతను.. అక్కడ బీడీ కాల్చుతున్నాడు. గమనించిన విమానయాన సిబ్బంది.. వెంటనే అతణ్ని తనిఖీ చేశారు. అతని వద్ద బీడీతో పాటు లైటర్ కూడా లభించింది. విమానం గోవాలో ల్యాండ్ అయ్యాక ఆశిష్‌ను పోలీసులకు అప్పగించారు. ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) ప్రకారం సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించిన సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విమానంలో పొగతాగడం చాలా ప్రమాదకరమని, అది తోటి ప్రయాణికులు, విమాన భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

స్పీకర్‌పై అవిశ్వాసం.. సభలో ఎవరి బలం ఎంత?

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల.. మే 17న పరీక్ష

Updated Date - Mar 09 , 2026 | 10:17 AM