Share News

పాక్ వ్యాపారి వినూత్న ట్రిక్ వైరల్.. పకోడీలు వేస్తూనే టీ తయారీ..

ABN , Publish Date - Jul 23 , 2026 | 08:36 AM

తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ చిరు వ్యాపారి వినూత్నంగా టీ తయారు చేసిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పాక్ వ్యాపారి వినూత్న ట్రిక్ వైరల్.. పకోడీలు వేస్తూనే టీ తయారీ..
Pakistan viral video

సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎవరైనా వినూత్నంగా ఆలోచించి చేసే పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ చిరు వ్యాపారి వినూత్నంగా టీ తయారు చేసిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పకోడీలు వేస్తున్న కడాయిలోనే టీ తయారు చేసిన అతడి ట్రిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Pakistan street vendor).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి పెద్ద కడాయిలో నూనె మరిగిస్తూ పకోడీలు వేస్తున్నాడు. అదే సమయంలో ఆ కడాయిలోని నూనెలో ఓ పాత్రను ఉంచి అందులో టీ మరిగిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు పనులు చేస్తూ సమయం, ఇంధనం ఆదా చేస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వ్యాపారి ట్రిక్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి (Pakora tea trick).


ఈ వీడియో చూసిన కొందరు 'ఒకే దెబ్బకు రెండు పనులు పూర్తి చేశాడు' అంటూ వ్యాపారి తెలివిని ప్రశంసించారు (Pakistan viral video). మరికొందరు మాత్రం ఈ విధానం పరిశుభ్రత, ఆహార భద్రత పరంగా సరైనది కాదంటూ వ్యాఖ్యానించారు. పాక్‌లో ప్రస్తుతం వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, అందుకే చాలా మంది ఇలాంటి ట్రిక్‌లు ఉపయోగిస్తున్నారని ఇంకొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్


పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 23 , 2026 | 08:38 AM