పాకిస్థాన్‌ను ఆ దేవుడే కాపాడుతున్నాడు.. ఈ కరెంట్ స్తంభం చూస్తే అశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Jan 26 , 2026 | 05:56 PM
ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పాక్ ప్రజల జీవన విధానం, అక్కడ మౌలిక వసతులకు సంబంధించిన వీడియోలు చర్చనీయాంశంగా మారతున్నాయి.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పాక్ ప్రజల జీవన విధానం, అక్కడి మౌలిక వసతులకు సంబంధించిన వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ విద్యుత్ స్థంభం అక్కడి పరిస్థితికి అర్థం పడుతోంది. ఒక్క కరెంట్ స్థంభానికి లెక్కలేనన్ని విద్యుత్ మీటర్లు, వందల సంఖ్యలో వైర్లు ఉన్నాయి. ఆ స్థంభం ప్రమాదకరంగా కనిపిస్తోంది (Pakistan viral video).
popartbutt143 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన ఓ కరెంట్ స్థంభం ఉంది. దానికి చాలా విద్యుత్ మీటర్లు, వైర్లు అనుసంధానమై ఉన్నాయి. ఏ కనెక్షన్ ఎక్కడికి వెళుతుందో గుర్తించడం చాలా కష్టం. స్థంభం పై నుంచి కింది వరకు కరెంట్ వైర్లు తగిలించి ఉన్నాయి. పైగా ఆ కరెంట్ స్థంభం చుట్టూ నీరు నిండిపోయి ఉంది. ఏ వైరు తెగి ఆ నీటిలో పడినా ఎంత ప్రమాదం సంభవిస్తుందో ఊహించడం కూడా కష్టం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (shocking electric pole).
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Pakistan shocking visuals). లక్షల మంది ఆ వీడియోను వీక్షించి తమ అభిప్రాయాలను తెలియజేశారు. పాకిస్థాన్ పూర్తిగా దేవుడి దయతోనే నడుస్తోందని ఒకరు కామెంట్ చేశారు. ఈ స్థంభాన్ని చూస్తే బ్రిటిష్ వారు కూడా దేవుడిని నమ్ముతారని మరొకరు పేర్కొన్నారు. ఎంతటి ఎలక్ట్రీషియన్‌కు అయినా ఈ స్థంభాన్ని చూస్తే బుర్ర తిరుగుతుందని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..
వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..