ఇలాంటి ఆలోచనలు భారతీయులకే వస్తాయేమో.. బైక్‌ను ఎలా మార్చేశారో చూడండి..
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:30 AM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Creative Indian trick).
@RealTofanOjha అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మీద ఒక విచిత్రమైన బైక్ కనిపిస్తోంది. బైక్ వెనుక సీటు స్థానంలో సౌకర్యవంతమైన కుర్చీని ఏర్పాటు చేశారు. ఒకరు బైక్ నడుపుతుండగా, మరొకరు సౌకర్యంగా ఉన్న వెనుక సీటుపై కూర్చున్నారు. అదే రోడ్డుపై వెళ్తున్న వేరే వ్యక్తి ఈ విచిత్రమైన బైక్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Indian viral video).
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు (Innovative idea). వందల మంది ఆ వీడియోను లైక్ తమ స్పందనలను తెలియజేశారు. ఇలాంటి తెలివితేటలు భారతీయులకు మాత్రమే వస్తాయని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ భారత్ దాటి బయటకు వెళ్లకూడదని ఒకరు పేర్కొన్నారు. 'వావ్.. ఇలాంటి కుర్చీ ఉంటే బైక్ మీద ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు' అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..