Share News

ఒమన్ తీరంలో అరుదైన దృశ్యం.. గులాబీ డాల్ఫిన్‌ల సందడి.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 21 , 2026 | 09:08 PM

ఒమన్‌లోని మస్కట్ సమీపంలోని ఖంటాబ్ బీచ్ వద్ద అరుదైన దృశ్యం కనిపించింది. నీలి సముద్రంలో గులాబీ రంగు డాల్ఫిన్‌లు ఈదుతూ కనిపించడంతో బీచ్‌కు వచ్చినవారు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒమన్ తీరంలో అరుదైన దృశ్యం.. గులాబీ డాల్ఫిన్‌ల సందడి.. వీడియో వైరల్
Oman Pink Dolphins

ఇంటర్నెట్ డెస్క్: ఒమన్‌లోని మస్కట్ నగర సమీపంలోని ఖంటాబ్ బీచ్ వద్ద గులాబీ రంగు డాల్ఫిన్‌లు కనిపించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రంలో ఈ డాల్ఫిన్‌లు ఈదుతూ.. అప్పుడప్పుడు నీటిపైకి తేలుతూ కనిపించడంతో బీచ్‌కు వచ్చినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా బూడిద రంగులో కనిపించే డాల్ఫిన్‌లకు భిన్నంగా గులాబీ రంగులో కనిపించడం ఈ దృశ్యాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.


గులాబీ రంగు డాల్ఫిన్‌ల ప్రత్యేకత ఏమిటి?

సాధారణంగా డాల్ఫిన్‌లు బూడిద రంగులో కనిపిస్తాయి. అయితే.. కొన్ని జాతులకు సహజంగానే గులాబీ రంగు చర్మం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ అమెరికాలోని నదుల్లో నివసించే అమెజాన్ నది డాల్ఫిన్‌లు గులాబీ రంగుకు ప్రసిద్ధి. వీటి చర్మం రంగు వయస్సు, రక్త ప్రసరణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మారవచ్చు. అయితే.. మస్కట్ తీరంలో కనిపించిన డాల్ఫిన్‌లు ఏ జాతికి చెందినవో ఇంకా నిర్ధారణ కాలేదు. వాటి రంగును బట్టి మాత్రమే జాతిని గుర్తించడం సాధ్యం కాదు అంటున్నారు.

సముద్ర జీవులపై పెరుగుతున్న ఆసక్తి..

ఒమన్ గల్ఫ్ అనేక రకాల సముద్ర జీవులకు ఆవాసంగా ఉంది. ఈ ప్రాంతంలో డాల్ఫిన్‌లను చూడటం సాధ్యమే అయినప్పటికీ.. గులాబీ రంగులో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో సముద్ర జీవుల వైవిధ్యం.. వాటి ప్రత్యేక లక్షణాలపై చర్చ మొదలైంది. కాకపోతే.. ఈ డాల్ఫిన్‌ల జాతి, వాటి రంగుకు గల కారణాలపై స్పష్టత రావాలంటే నిపుణుల నిర్ధారణ అవసరం ఉందంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం: దేవినేని ఉమా

For More AP News And Telugu News

Updated Date - Oct 21 , 2026 | 09:12 PM