కాలేజీ ఫ్రెండ్స్‌తో టచ్‌లో లేకపోతే ఇంతే.. షాక్ తప్పదు
ABN , Publish Date - Feb 07 , 2026 | 09:02 PM
చాలా ఏళ్ల తరువాత తన కాలేజీ స్నేహితుడితో మాట్లాడిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తనకెదురైన అనుభవాన్ని వివరిస్తూ ఆ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: స్కూల్, కాలేజీ రోజుల స్నేహాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. కానీ, లైఫ్‌లో క్షణం తీరిక లేకుండా గడిపే అనేక మంది తమ స్నేహితులకు అంతగా టచ్‌లో ఉండరు. ఏ పదేళ్లకో, పాతికేళ్లకో ఒకసారి ఏదోక పార్టీలో కలుస్తుంటారు. ఇలా చేస్తే ఊహించని షాకులు తగులుతాయని జైపూర్‌కు (రాజస్థాన్) చెందిన ఓ వ్యాపారి నెట్టింట సరదా పోస్టు పెట్టారు. తనకు ఎదురైన ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నారు.
రవీ హండా అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. చాలా ఏళ్ల తరువాత తన స్నేహితుడితో ఫోన్‌లో ఇటీవల చాట్ చేసినట్టు చెప్పారు. తన ఫ్రెండ్ సైన్స్ పట్టభద్రుడని, ఐఐటీలో చదువుకున్నాడని తెలిపారు. ఆ తరువాత అధ్యాపకుడిగా మారాడని కూడా చెప్పారు.
ప్రస్తుతం ఏం చేస్తున్నావని తాను అతడిని అడిగితే లాయర్ అయ్యానని అతడు చెప్పాడని అన్నాడు. దీంతో, తాను షాకైపోయినట్టు చెప్పాడు. ఐఐటీలో సైన్స్ డిగ్రీ చేసిన వ్యక్తి చివరకు ఇలా లాయర్‌గా మారడంతో తనకు చెప్పలేనంత ఆశ్చర్యం కలిగిందని అన్నారు.
‘దయ చేసి మీ ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉండండి. లేకపోతే నాలాగే షాక్ తినాల్సి వస్తుంది. వాళ్ల జీవితాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాక నోరెళ్లబెట్టాల్సి వస్తుంది’ అని సరదా కామెంట్ చేశారు.
ఈ పోస్టుపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తమకూ ఇలాంటి అనేక అనుభవాలు ఎదురయ్యాయని కొందరు చెప్పారు. పదేళ్ల తరువాత ఫ్రెండ్స్ జీవితాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయని తెలిసి ఆశ్చర్యం వేసిందని అన్నారు.
ఇవీ చదవండి:
వెంటాడిన దురదృష్టం.. రైలు వెళ్లాక పట్టాలు దాటుతుంటే..
యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..