Share News

వెంటాడిన దురదృష్టం.. రైలు వెళ్లాక పట్టాలు దాటుతుంటే..

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:02 PM

బిహార్‌కు చెందిన ఓ మహిళ ఊహించని ప్రమాదంలో పడింది. ట్రాక్‌‌ను ఆనుకుని ఉన్న చెక్క దుంగలపై రైలు వెళ్లగా.. ఓ చెక్క దుంగ ఎగిరి వచ్చి మహిళకు బలంగా తగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వెంటాడిన దురదృష్టం..  రైలు వెళ్లాక పట్టాలు దాటుతుంటే..
Bihar viral train accident video

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో (Bihar) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలు వెళ్లాక పట్టాలు దాటిన మహిళను దురదృష్టం వెంటాడటంతో తీవ్ర ప్రమాదంలో పడింది. గయా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఊహించని ప్రమాదం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Woman Hit by Flying Log).

పహార్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో (Paharpur Railway station) ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు ప్యాసెంజర్లు రైళ్లల్లో తీసుకొచ్చిన చెక్క దుంగలను రెండు రైల్వే ట్రాక్స్ మధ్య పేర్చారు. వాటిని ప్లాట్‌ఫామ్ మీదకు తీసుకెళ్లేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ రైలు వెళ్లాక పట్టాలను దాటడటం మొదలెట్టింది.


ఇంతలో మరో ట్రాక్‌పై నుంచి ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో పట్టాల పక్కన ఉన్న చెక్క దుంగకు రైలు తగలడంతో అది గాల్లోకి ఎగిరి అవతలివైపు పట్టాలు దాటుతున్న మహిళకు తగిలింది. చెక్క దుంగ బలంగా తగలడంతో మహిళ కూడా గాల్లోకి ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల వారు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఆ బాధితురాలు అనూహ్యంగా ప్రమాదంలో పడటాన్ని వీడియోలో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దురదృష్టం వెంటాడితే తప్పించుకోవడం అసాధ్యమని నిర్వేదం వ్యక్తం చేశారు. కొందరు బాధితురాలిదే తప్పని కూడా చెప్పుకొచ్చారు. మరికొందరేమో రైల్వే అధికారులను ప్రశ్నించారు. రైల్వే ట్రాక్స్ మధ్య చెక్కలను దింపేందుకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య సంచలనంగా మారిన ఈ వీడియోను మీరూ చూడండి!


ఇవీ చదవండి:

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో

Updated Date - Feb 06 , 2026 | 04:52 PM