Share News

ఆలయంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:00 AM

ఒడిశాలోని గంజాం జిల్లాలోని రత్నయ్ ఆలయంలో బుధవారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుడి తలుపులు తెరిచిన పూజారికి ఎదురుగా 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

ఆలయంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం.. వీడియో వైరల్
King Cobra in Temple

ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలోని గంజాం జిల్లాలోని రత్నయ్ ఆలయంలో బుధవారం సాయంత్రం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం పూజల నిమిత్తం ఆలయ తలుపులు తెరిచిన పూజారి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. గర్భగుడిలో ఏకంగా 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించడంతో భయంతో వణికిపోయాడు. వెంటనే స్థానికులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్నేక్ హెల్ప్‌లైన్ బృందం ఆలయానికి చేరుకుని పామును సురక్షితంగా బయటకు తీసింది.


దాదాపు గంటపాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమీపంలో వినిపించిన డప్పు చప్పుళ్ల సమయంలో కింగ్ కోబ్రా ఒక్కసారిగా కదలకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. దీంతో రెస్క్యూ సిబ్బందికి పామును పట్టుకోవడం సులభమైంది. ఎలాంటి హానీ కలగకుండా 12 అడుగుల పామును సురక్షితంగా బంధించిన అనంతరం.. దానిని ఆలయం నుంచి తరలించి, సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రమాదకరమైన పాము ఆలయంలోకి రావడంతో ఆందోళన చెందిన స్థానికులు, రెస్క్యూ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గాల్లోకి ఎగిరిన పవర్‌బోట్‌.. వీడియో వైరల్

పరిగెత్తండి.. తినండి.. పరిగెత్తండి.. విశ్వవిద్యాలయంలో వినూత్న ఛాలెంజ్‌

Updated Date - Sep 04 , 2026 | 11:15 AM