ఇలాక్కూడా పాములను పడతారా?.. పాము కాటేయబోతుంటే..
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:06 PM
పామును నోటితో పట్టిన ఓ ఒడిశా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. వీడియోకు కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చి పడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాము కూడా ఒకటి. విషరహిత పాములు ఉన్నప్పటికీ ఏ పాము ఏ రకమో తెలియకపోతే రిస్క్ పెరుగుతుంది. ఇలాంటప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అయితే, ఒడిశాకు (Odisha) చెందిన ఓ వ్యక్తి ఇవేమీ పట్టించుకోలేదు. పామును ఏకంగా తన నోటితో పట్టుకుని చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టేలా చేశాడు (Catch snake with Mouth).
బాలాసోర్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. భయంకరమైన నాగు పాముని అతడు జస్ట్ నోటితో పట్టి జనాలను ఆశ్చర్యపరిచాడు. వీడియోలో (Viral Video) కనిపించిన దాని ప్రకారం, అతడు సమీపిస్తుండగానే పాము అలర్ట్ అయిపోయింది. పడగ ఎత్తి అతడిని బెదిరించే ప్రయత్నం చేసింది. కాటు వేసేందుకు రెడీ అయ్యింది. కానీ ఆ వ్యక్తి మాత్రం వెనక్కు తగ్గలేదు. పాము దగ్గరగా ముఖం పెట్టాడు. అది రియాక్ట్ అయ్యేలోపే దాని పడగను నోటకరిచి పట్టుకున్నాడు. ఆ తరువాత ఏమీ జరగనట్టు లేచి చిలబడ్డాడు. చివరకు ఓ బ్యాగులోకి పామును జాగ్రత్తగా పంపించాడు.
ఇక ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అది అతడి పెంపుడు పాము అయ్యుండొచ్చని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం పాముతో ముప్పు ఉందని తెలిసీ అతడు ఈ దుస్సాహసం చేశాడని అన్నారు. భారతీయుల టాలెంట్ ఈ రేంజ్‌లోనే ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు. భారతీయులు సాధారణ వ్యక్తులు కారని, కాబట్టి, అతడి స్టంట్ మంచి చెడుల గురించి తాను మాట్లాడబోనని ఓ వ్యక్తి ముక్తాయించాడు. వీడియోలో కనిపించిన మరో పామును కూడా జనాలు గుర్తించారు. ఆ సమయంలో అది కాటేసి ఉంటే కథ మరో మలుపు తిరిగి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో
యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..