తుఫాన్ వేళ మగబిడ్డ జననం.. ఆర్నబ్ అని పేరు పెట్టిన కుటుంబం
ABN , Publish Date - Oct 28 , 2026 | 10:03 PM
ఆర్నబ్ తుఫాన్ పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. దీని తీవ్రత తీరప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది. అయితే ఈ భీకర తుఫాన్ వేళ ఆసక్తికర ఘటనొకటి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్నబ్ తుఫాన్ పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. దీని తీవ్రత తీరప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది. అయితే ఈ భీకర తుఫాన్ వేళ ఆసక్తికర ఘటనొకటి జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఓ గర్భిణికి నిన్న (మంగళవారం) మగబిడ్డ పుట్టాడు. తుఫాన్ సమయంలో జన్మించిన పసికందుకు ఆ తుఫాన్ పేరే పెట్టేశారు కుటుంబ సభ్యులు. ‘ఆర్నబ్’ అని నామకరణం చేసేశారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇచ్చేశారు.
మరోవైపు ఒడిశాలో ఆర్నబ్ బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజులుగా అక్కడ బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రసవం దగ్గరపడిన గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇవీ చదవండి
ఆర్నబ్ తుఫాను ప్రభావం.. చెన్నైలో రోడ్లపైకి ఎగసిపడుతున్న అలలు
5 స్టార్ హోటల్‌లో కస్టమర్‌పై జీవితకాల నిషేధం.. ఎందుకో తెలిస్తే..