Share News

‘మనోళ్లకు కుళ్లు ఉంటుంది..’ ఎన్నారైలపై మరో భారతీయుడి విమర్శలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 03:14 PM

అమెరికా చదువులపై ఎన్నారైల సలహాలు తీసుకునే విషయంలో తొందరపాటు వద్దంటూ భారతీయులకు మరో ఎన్నారై ఇచ్చిన సలహా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

‘మనోళ్లకు కుళ్లు ఉంటుంది..’ ఎన్నారైలపై మరో భారతీయుడి విమర్శలు
NRI's views on Studes in USA

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం అమెరికా చదువంటే అనేక మంది వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. యూఎస్‌కు వెళ్లాలనుకునే వారు ఇప్పటికే అక్కడ సెటిలైన ఎన్నారైల సలహా తీసుకుని ఆపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఎన్నారైలు ఇచ్చే సలహాలపై మరో ఎన్నారై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో నెట్టింట ఆయన పంచుకున్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. అమర్‌నాథ్ శివశంకర్ అనే వ్యక్తి ఈ పోస్టును షేర్ చేశారు.

‘ఒక ఎన్నారైగా నేను చెప్పేది ఏంటంటే.. చాలా మంది ఎన్నారైలకు ఈర్ష్య ఎక్కువ. ఇతరులు తమ కంటే మెరుగ్గా ఉంటే తట్టుకోలేరు. ఇండియా నుంచి మరింత మంది అమెరికాకు వస్తే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని వారి భయం. భారత్‌లో నిజంగానే అన్ని అవకాశాలు ఉంటే వారు ఎందుకు భారత్ తిరిగి వెళ్లడం లేదు?’ అని ప్రశ్నించారు. భారతీయ యువత అమెరికాకు రావొద్దంటూ ఎన్నారైలు చెబుతున్నారన్న ఓ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలు చెప్పారన్న ఒకే ఒక కారణంతో అమెరికాలో చదువు ప్లాన్‌ను పక్కనపెట్టేయవద్దని సూచించారు.


‘మీ వద్ద డబ్బు ఉంటే, స్టూడెంట్స్ లోన్ బెడద తక్కువగా ఉంటే.. మంచి యూనివర్సిటీని ఎంచుకోండి. క్యాంపస్ హైరింగ్ అవకాశం ఉన్న విశ్వవిద్యాలయాలనే ఎంచుకోండి. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ రావడం కొంచెం కష్టం. భారత్ ఆవల జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మీకు ఇతర దేశాల్లో జాబ్ వస్తే వెళ్లండి. అక్కడ జీవితానుభవం కొత్తగా ఉంటుంది. క్లైంట్‌లతో పని చేస్తూ ఉంటే ఎదురయ్యే సవాళ్లు, నేర్చుకునే విషయాలు భిన్నంగా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకు తిరిగి వెళ్లిపోవచ్చు’ అని అన్నారు. ఈ పోస్టుపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవతలి వారి కుళ్లు, లేదా అధిక పోటీల ఆధారంగా అమెరికా చదువులపై నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. అనేక ఇతర అంశాలు తరచి చూసుకున్నాకే ముందడుగు వేయాలని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

గోడపైకి ఎక్కిన కోబ్రాను PVC పైపుతో పట్టేశాడు.. వీడియో చూస్తే గుండె ఆగాల్సిందే!

జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఫొటోషూట్.. చివరికి ఏమైందంటే..

Updated Date - Aug 23 , 2026 | 03:48 PM